విజయవాడ

ఉద్యోగుల స్థలాలతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 13: రెండు దశాబ్దాల క్రితం మున్సిపల్ ఉద్యోగులకు గుణదలలోని 67 ఎకరాల స్థలంలో కేటాయించిన ప్లాట్‌లతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయవద్దని ఎఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు అన్నారు. శుక్రవారం జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ 1995 సం.లో నాటి మేయర్ టి.వెంకటేశ్వరరావు చొరవతో విజయవాడ నగరపాలక సంస్థలో ఇళ్ళులేని ఉద్యోగులకు గృహవసతి కల్పించాలనే ఉద్దేశంతో గుణదల ప్రాంతంలో 67 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయటం జరిగిందని అన్నారు. ఉద్యోగుల నుండి స్థలం కొనుగోలుకు మరియు డెవలప్‌మెంట్ చేయటానికి నిధులను సమీకరించటం జరిగిందని, కానీ నేటి వరకు సదరు స్థలాన్ని అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. ఇది ఇలావుండగా మిగిలిన ప్లాట్‌లను ఉద్యోగులకు కేటాయించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు నగరపాలక సంస్థ ప్రయత్నిస్తుందని విమర్శించారు. గజం విలువ 25 వేల రూపాయలుగా పేర్కొంటున్నారని ఉద్యోగుల స్థలాలతో వ్యాపారం చేస్తారా అని ప్రశ్నించారు. గత ఆరునెలలు క్రితం నగరపాలక సంస్థ మేయర్, శాసనసభ్యులతో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేశారని కానీ నేటి వరకు అతిగతి లేదని విమర్శించారు. తక్షణం ఉద్యోగుల స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకొని ఉద్యోగులకే ఆ స్థలాన్ని కేటాయించాలని, సదరు స్థలాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎఐటియుసి నగర కార్యదర్శి నీలం దుర్గారావు పాల్గొన్నారు.