విజయవాడ

నదీ కాల్వల్లో పూల, కూరగాయల చెత్తను వేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 13: నగరంలోని రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ పూల, కూరగాయల మార్కెట్‌కు చెందిన చెత్తను డస్ట్‌బిన్లో కాకుండా నేరుగా కాల్వలో వేస్తే కఠిన చర్యలు తీసుకోబడునని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈసందర్భంగా గురువారం ఉదయం వీరపాండియన్ తన ఛాంబర్‌లో మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి షాపుల నిర్వాహుకులు అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. పూల, కూరగాయల చెత్తను మార్కెట్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్‌కు నదీకాల్వపై ఉన్న నడక దారి పై నుంచి కాల్వలో వేస్తున్న చర్యలపై తమకు అందిన ఫిర్యాదుల మేరకు అట్టివారి ఫొటోలు తీసి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఎవరికి వారు డస్ట్‌బిన్‌ను ఏర్పాటుచేసుకొని విఎంసి నిర్ధేశించిన డంపర్ బిన్‌లోనే ఆ చెత్తను వేయాలని సూచించారు. ఈసమావేశంలో సిఇ ఎంఎ షుకూర్, ఇఇ ఉదయకుమార్, తదితరులు పాల్గొన్నారు.
పెంపుడు జంతు సంచారం నియంత్రించాలి
విజయవాడ నగర పరిసరాల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేయడమే కాకుండా ట్రాఫిక్ సమస్యల సృష్టికి కారణమవుతున్న పెంపుడు జంతువుల సంచారాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. పెంపుడు జంతువులైన ఆవులు, గేదెలను రోడ్లమీదకు వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై సంచరించే ఆయా జంతువుల సంచారం కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా మున్సిపల్ చట్టాల ప్రకారం వారి యజమానులపై కఠిన చర్యలు తీసుకోబడునని ఆయన హెచ్చరించారు.