విజయవాడ

నగరంలో 279 జీవో అమలుకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: విజయవాడ నగరంలో త్వరలో అమలుకానున్న 279 జీవో నేపథ్యంలో నగర పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుకు వర్క్‌బేస్డ్ పనివిధానాన్ని ప్రవేశపెట్టేందుకున్న సాధ్యాసాధ్యాలపై విఎంసి కమిషనర్ వీరపాండియన్ సమీక్షించారు. గురువారం ఉదయం తన ఛాంబర్‌లో విజన్ ఇండియా అనే స్వతంత్ర సంస్థ ద్వారా ఎస్సెంట్ స్టేట్ కన్సల్‌టెంట్ సాంబమూర్తి ఆధ్వర్యంలో 45రోజులుగా ప్రజారోగ్య అధికారులు నిర్వహించిన సర్వే వివరాలను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. సర్వే ప్రకారం నగరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి మొత్తం 1185 మైక్రో పాకెట్లుగా విభజించగా ఒకొక్క మైక్రో పాకెట్‌లో మురికివాడల్లోని 250, కొండ ప్రాంతాల్లోని 200, కింది భాగంలో 358 నివాసాలు వుండేలా గుర్తించారు. ఒక్కో ప్యాకేజీలో సుమారు 200 మైక్రో పాకెట్లతో 6 ప్యాకేజీలుగా గుర్తించిన సర్వే అధికారులు ఇళ్లు, వాణిజ్య ప్రాంతాల్లో ప్రతిరోజూ జరుగుతున్న డోర్ టు డోర్ సేగ్రిగేటెడ్ వేస్ట్ మెటీరియల్ సమీకరించి ప్రైమరీ, సెకండరీ ట్రాన్స్‌పోర్ట్‌కు రూపొందించిన మ్యాప్‌ల వివరాలను కమిషనర్‌కు వివరించారు. లిట్టర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇప్పటికే ఈ విధానం అమలుకు పూర్తిస్థాయిలో తక్షణమే చర్యలు చేపట్టాలని వీరపాండియన్ అధికారులకు సూచించారు. సమావేశంలో సిఎంహెచ్‌ఓ డాక్టర్ గోపినాయక్, హెల్త్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ అండ్ జోనల్ కన్సల్‌టెంట్స్ రేవంత్, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.