విజయవాడ

అంబాపురంలో వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, నవంబర్ 18: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాపురంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అతడిని పథకం ప్రకారం హత్య చేయడానికే ఆ ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని హత్యానంతరం నిందితురాలు పరారైంది. పోలీసుల కథనం ప్రకారం అంబాపురంలోని సండ్ర నూకమ్మ (70) అనే వృద్ధురాలికి రెండు గదుల బిల్డింగ్ ఉంది. ఓ గదిలో నూకమ్మ ఉంది. రెండో గది ఖాళీగా ఉంది. మంగళవారం ఉదయం సుమారు 35 సంవత్సరాల వయసున్న వ్యక్తి, సుమారు 30 సంవత్సరాల యువతి నూకమ్మతో మాట్లాడి నెలకి వెయ్యి రూపాయలు అద్దె ఇవ్వడానికి అంగీకరించారు. మంగళవారం రాత్రి వారిద్దరు ఆ ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున ఆ యువతి తలుపుకి తాళం వేసి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చింది. తన భర్త తాళం వేసుకుని బయటకు వెళ్లాడని గుమ్మం ముందే పడిగాపులు గాసింది. ఆమె అలాగే ఉండడం గమనించిన నూకమ్మ కుమార్తె ఆమెను ఇంట్లోకి ఆహ్వానించి భోజనం పెట్టింది. అనంతరం ఓ యువకుడు మోటారు సైకిల్‌పై రాగా అతని బైక్‌పై వెళ్లిపోయింది. ఇంటికి తాళం వేయడంతో నూకమ్మ కొత్తగా దిగిన వారు ఇంకా వస్తారని ఎదురుచూసింది. ఇంటి సామగ్రి కూడా తెచ్చుకోనందున వారు వస్తారనుకున్నారు. శుక్రవారం నాటికి ఇంటి నుండి దుర్గంధం రావడంతో నూకమ్మ కుమార్తె బిక్షమ్మ తలుపు తాళాలు పగలగొట్టి చూడగా ఈ హత్యోదంతం వెలుగు చూసింది. కాగా ఆ గదిలో అద్దెకు దిగినవారి ఊరూపేరు కూడా ఎవ్వరికీ తెలియదు. మంగళవారం ఉదయం అద్దె మాట్లాడి రాత్రి ఆ గదిలో బస చేయడం ఆ వ్యక్తిని హత మార్చడం ఇదంతా పథకం ప్రకారం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బిక్షమ్మ ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కుళ్లిన శవాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐ ఎన్‌విఎస్ దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం వచ్చింది. వేలిముద్రలు సేకరించారు. మద్యం మత్తులో ఉండగా చీరతో మెడ బిగించి ఊపిరాడకుండా హతమార్చినట్టు ఉంది.