విజయవాడ

విద్యుత్ చౌర్యంపై ఇక ముమ్మర దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సిఎండి సహాయ సహకారాలతో కృషి చేస్తున్నామని విద్యుత్ విజిలెన్స్ ఎస్‌ఇ రవికుమార్ తెలిపారు. బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానం రైతు బజారు ఎదురుగా ఉన్న ఎపిఎస్‌పిడిసిఎల్ ఆవరణలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వి.మనోహర్‌తో కలసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎండి ఆదేశాలకు అనుగుణంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని నాలుగు జిల్లాలో విద్యుత్ వినియోగంలో చౌర్యాన్ని అరికట్టేందుకు ఆకస్మిక దాడులు చేస్తున్నామని తెలిపారు. ఈ 8జిల్లాల్లో 40 మంది టీంతో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు గృహాలు, పరిశ్రమలు, ఆక్వారంగం తదితర ప్రాంతాలలో దాడులు చేస్తున్నామని, రాబోయే కాలంలో వీటిని కొనసాగిస్తామని తెలిపారు.
జిల్లాలో తిరువూరు, నూజివీడు, నందిగామ, ఆగిరిపల్లి, మచిలీపట్నం, అవనిగడ్డల్లో 6 బృందాలుగా విడిపోయి దాడులు చేశామన్నారు. ఆక్వాలో జరుగుతున్న మోసాలపై కూడా దృష్టిపెట్టామని, మోపిదేవి, నందివాడ, అవనిగడ్డల్లో 7 కేసులు నమోదు చేశామన్నారు. ఆక్వా రంగంలో కరెంట్ చౌర్యానికి 6 కేససులు బుక్ చేశామని, రూ.7 లక్షలు అపరాధ రుసుము విధించామన్నారు. మీటర్ బైపాస్‌లో 4 కేసులు, కొక్క్యాలు ద్వారా 10 కేసులు, గృహాల నుంచి వ్యాపారానికి ఉపయోగిస్తున్న విద్యుత్ కేసులు 15 మొత్తంగా 177 మందిపై విద్యుత్ చౌర్యానికి సంబంధించి కేసులు నమోదు చేశామని తెలిపారు. అక్రమ విద్యుత్ చౌర్యలపై ఒకసారి పెనాలిటీ విధిస్తామని, తదుపరి అరెస్టు చేసి కోర్టుకు పంపిస్తామన్నారు.
రాష్ట్రంలో మార్చి నుండి అక్టోబర్ వరకు జరిపిన దాడుల్లో రూ.22,603 సర్వీసులలో విద్యుత్ చౌర్యం జరిగిందని, దీనికి గాను రూ.13 లక్షల 23 వేల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. అనంతపురం, కడపలలో విద్యుత్ చౌర్యం ఎక్కువగ జరుగుతుందని తెలిపారు. గృహరంగాలలో, వ్యాపారరంగంలో విద్యుత్ చౌర్యం ఎక్కువగా జరుగుతుందని విజిలెన్స్ అధికారి వి.రవి తెలిపారు.