విజయవాడ

నగదు రహిత చెల్లింపుకుకై వ్యాపారులకు ‘పోస్’ మిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: నగదు రహిత చెల్లింపులకై వ్యాపారస్తులకు పోస్ మిషన్లు తక్షణమే అందించటంతో పాటు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ బ్యాంకర్లు, పోస్టల్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని బ్యాంకులు, పోస్ట్ఫాసులకు నగదు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు నగదు సర్దుబాటు చేయాలని కోరారు. క్యాష్‌లెస్ ఎకానమిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్, ఎస్‌పిసిఐలపై బ్యాంకులు, ఎటియం కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపారస్తులు, పోస్ మిషన్లు సమర్పించే దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ కోరారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవటంతో పాటు ఖాతాలను పునరుద్దరించాలని బ్యాంకు అధికారులను కలెక్టర్ కోరారు. కళాశాలలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నగదు రహిత చెల్లింపులపై ప్రజలకు ముఖ్యంగా బ్యాంకులు, ఎటియంల వద్ద అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. జిల్లాలోని అన్ని రైతుబజార్లలో బ్యాంకర్లు దత్తత తీసుకొని మైక్రో ఎటియంల ద్వారా నగదును అందించేందుకు వీలుగా బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించాలని కలెక్టర్ బ్యాంకు అధికారులను కోరారు. హెల్ప్ డెస్క్‌లులు వద్ద వ్యాపారస్తులకు అవసరమైన పోస్ మిషన్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని మండల కార్యాలయాల్లో హోల్‌సేల్, రిటైల్, జ్యూయలరీ, ఫ్యాన్సీ, టెక్స్ టైల్స్, కిరాణా, మెడికల్ వ్యాపారస్తులకు నగదు రహిత చెల్లింపులకై పోస్ మిషన్లపై అవగాహన కల్పించి వాటిని ఏర్పాటు చేసేలా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ టెలీకాన్ఫరెన్సు ద్వారా అధికారులను ఆదేశించారు.