విజయవాడ

కృష్ణా వర్సిటీ మహిళల కబడ్డీ చాంప్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 4: మాంటిస్సోరి మహిళా కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల కబడ్డీ మహిళల టోర్నమెంట్ ఆదివారం కళాశాల ఆవరణలో నిర్వహించారు. టోర్నమెంట్‌ను ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. వి రవి ప్రారంభించారు. టోర్నమెంట్‌లో ఐదు జట్లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించారు. మొదట జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో మారిస్ స్టెల్లా కళాశాలపై 43-32 తేడాతో వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు విజయం సాధించి లీగ్ దశకు అర్హత సాధించింది. లీగ్ దశలో మాంటిస్సోరి మహిళా కళాశాలపై 48-20 తేడాతో ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ కళాశాల, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై 15-7 తేడాతో ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ కళాశాల, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై 29-9 తేడాతో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ కళాశాలపై 56-55 తేడాతో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై 33-18 తేడాతో మాంటిస్సోరి మహిళా కళాశాల, మాంటిస్సోరి మహిళా కళాశాలపై 32-16 తేడాతో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్లు గెలుపొందాయి. ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రథమ, ఎజి అండ్ ఎస్‌జి సిద్ధార్థ కళాశాల ద్వితీయ, మాంటిస్సోరి మహిళా కళాశాల తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా. ఎన్ శ్రీనివాసరావు పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్ పద్మావతి, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి జి సుధారాణి, వివిధ కళాశాలల వ్యాయామ విద్యా సంచాలకులు పాల్గొన్నారు. టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత్రి వి కోటేశ్వరమ్మ, సంయుక్త కార్యదర్శి ఎ రాజీవ్ శుభాకాంక్షలు తెలిపారు.

7న దుర్గగుడి హుండీల లెక్కింపు
ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 4: దుర్గమ్మ సన్నిధిలో ఈనెల 7న హుండీలను లెక్కిస్తున్నట్లు దుర్గగుడి ఇవో సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈలెక్కింపులో పాల్గొనే భక్తులు 7న ఉద యం 7గంటలకే దేవస్థానం కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు.

అదరహో హ్యపీ సండే....
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 4: విజయవాడ నగరపాలక సంస్థ, డీప్ స్వచ్చంద సంస్థ, పోలీస్ శాఖ, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతినెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న హ్యపీ సండే కార్యమ్రానికి విశేష స్పందన లభిస్తుంది. ఆదివారం నిర్వహించిన హ్యపీ సండే కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్ధులు పాల్గొని దుమ్మురేపారు. ఆటలతోనే కాకుండా నృత్యప్రదర్శనలతో పాటు తమకిష్టమైన డ్యాన్స్‌లతో విద్యార్ధులు చలరేగిపోయారు. సెపక్‌తక్రా, వాలీబాల్, బా డ్మింటన్, యోగాలతో పాటు ప్రత్యేక వేదికపై ఊర్రుతలుగించారు. హ్యపీసండేకు ప్రజలతో పాటు విద్యార్ధుల ఆదరణ లభిస్తుంది. అంతకుముందు అమరావతి మారథన్ ప్రోమో రన్‌ను నగర పోలీస్ కమీషనర్ గౌతంసవాంగ్ పాల్గొని జెండా ఊపి రన్‌నుప్రారంభించారు. జనవరి 8వతేదీన అమరావతి మారథన్ నగరంలో జరుగనుంది. దీనిని పురస్కరించుకుని ఆదివారం ప్రోమో రన్‌ను నిర్వహించారు. ఈరన్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, యువత పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, వివిధ కళాశాలల విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.