విజయవాడ

‘స్థానిక’ పోరుకు ముందే ‘అన్న క్యాంటీన్లు’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు ప్రక్రియ రెండేళ్లు దాటుతున్నా కొలిక్కిరావడం లేదు. రాష్ట్రంలో జరగాల్సిన కొన్ని పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు ముందు మాత్రమే ఈ క్యాంటీన్లు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే పథకం ఇంకా ప్రారంభించకపోవడం వెనుక ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తవౌతోంది. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల తరహాలో రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి భారీ కసరత్తు కూడా చేసింది. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీని వేసింది. 2104 ఆగస్టులో మంత్రులు, అధికారులు తమిళనాడులో పర్యటించారు. చెన్నై నగర పరిధిలోనే 230 క్యాంటీన్లు ఏర్పాటు చేయగా, రోజుకు 1.5 లక్షల మంది వాటిలో లభించే ఆహారం తింటున్నారు. రూపాయికే ఇడ్లీ, 5 రూపాయలకే సాంబారన్నం, పొంగల్, పెరుగున్నం అందిస్తున్నారు. దీంతో ఈ పథకం అక్కడ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసేందుకు రెండేళ్ల క్రితమే ప్రక్రియ ప్రారంభించారు. విశాఖ, అనంతపురం, తిరుపతి, గంటూరుల్లో 35 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. క్యాంటీన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించేందుకు హడావుడి చేశారు. కానీ ఇప్పటికీ అది కొలిక్కిరాలేదు. కొంతకాలం ఈ అంశాన్ని దాదాపు పక్కన పెట్టేశారనవచ్చు. కొద్దిరోజుల క్రితం వెలగపూడి సచివాలయంలో మంత్రుల బృందం సమావేశమై ఈవిషయమై చర్చించారు. రాష్ట్రంలో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. అయితే హైదరాబాద్, తమిళనాడుల్లో అమలు జరుగుతున్న ఈ పథకాన్ని మరోసారి అధ్యయనం చేసి నివేదికను మంత్రులు సమీక్షిస్తామని తెలిపారు. సమీక్ష తరువాత సిఎంకు వివరించి, తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు. దీంతో ప్రక్రియ మొదటికొచ్చినట్లు చెప్పవచ్చు. ఇడ్లీ, కొన్నిరకాల అన్నం, అందించాలా? లేక పూర్తిగా భోజనం అందించాలా? అనే అంశంపై అధ్యయనం చేయనున్నారు. ఆయా జిల్లాల్లో ఎక్కువ తినే ఆహారం కూడా అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. ఇదంతా ముగిసి ప్రజలకు క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే ఈ పథకం ప్రభావం పేదలపై ఎక్కువగా ఉంటుంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు వీలుగా త్వరలో జరగాల్సి ఉన్న పురపాలక, నగరపాలక సంస్థ ఎన్నికల ముందు మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.