విజయవాడ

చింతూరు ఏజెన్సీ సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో ఏజెన్సీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. పోలవరం ముంపు మండలాల్లో ఏజెన్సీ ప్రజలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముంపు, పునరావాసం సమస్యలు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు ఎలాగూ మునిగిపోయే ప్రాంతం గనుక సాధారణ పౌర సదుపాయాలు, వౌలిక సదుపాయాలు కల్పించటం లేదు. విద్య, వైద్య సౌకర్యాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన తెలిపారు. పోలవరం ముంపు గ్రామాలు మొదట 17గా ప్రకటించారని, తర్వాత అదనంగా మరో 14 గ్రామాలను చేర్చారన్నారు. మొత్తం 31 గ్రామాలు, వీటితోపాటు అదనంగా మరో 5 గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఈ 19 గ్రామాలను ముంపు గ్రామాల జాబితాలో నోటిఫై చేయనందున ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. మండలవ్యాప్తంగా 32 సాగునీటి లిఫ్టులు ఉన్నాయన్నారు. వీటిలో ప్రస్తుతం 3 మాత్రమే పనిచేస్తున్నాయని, 29 లిఫ్టులు మూలనపడి సాగునీరు అందక రైతుల వ్యవసాయం సాగడం లేదన్నారు. సోకిలేరు మీద కన్సూలూరు వద్ద చెక్‌డ్యాం నిర్మిస్తే 10వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. చంద్రవంక వాగుపై వంకగూడెం వద్ద చెక్‌డ్యామ్ నిర్మిస్తే 5 వేల ఎకరాల పంట భూములకు సాగునీరు అందుతుంది. సీలేరు నదిపై నేలకోట వద్ద ఆనకట్ట నిర్మిస్తే 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన సూచించారు. చింతూరులో ఉన్న 11 ఆశ్రమ పాఠశాలల్లో 5 పాఠశాలలకు మినరల్ వాటర్ ట్యాంకులు పాడైపోయాయని, గత రెండేళ్లుగా మరమ్మతులు చేయడం లేదన్నారు. చింతూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక పేద విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో మధు అభ్యర్థించారు.