విజయవాడ

అందరికీ మార్గదర్శి అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), డిసెంబర్ 6: నాడు డాక్టర్ అంబేద్కర్ ప్రవచించిన సిద్ధాంతాలే నేడు అమలవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ అన్నారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లోని ఏసి ఆడిటోరియంలో విజయవాడ డివిజన్‌లోని పర్సనల్ బ్రాంచి విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథిగా డిఆర్‌ఎం అశోక్‌కుమార్ ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన నోట్ల మార్పిడి విధానం నాడు డాక్టర్ అంబేద్కర్ పదేళ్లకొకసారి అమలు చేయాలని చెప్పిందేనన్నారు. అలాగే మహిళలకు ప్రసూతి సెలవులు వంటివి మహిళా ఉద్యోగులకు అవసరమని చెప్పారన్నారు. అంబేద్కర్ ఒక కులానికో, మతానికో చెందినవారు కాదని, కుల మతాలకు అతీతంగా అందరికీ కావాల్సిన నేత అని అన్నారు.
అనంతరం సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఎం శ్రీరాములు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చూపించిన సిద్ధాంతాలు, ఆయన చూపించిన రాజ్యాంగ విధానాలు ప్రభుత్వపరంగా విజయవాడ డివిజన్‌లో అమలు జరుగుతున్నాయన్నారు. డిఆర్‌ఎం అశోక్‌కుమార్ నేతృత్వంలో నేటికి ఎస్సీ, ఎస్టీ వర్గీయులకు ఉద్యోగరీత్యా ఎవరికి అమలు కావాల్సిన విధానాలు వారికి సక్రమంగా అమలు చేస్తున్నామన్నారు. వృత్తిరీత్యా కాని, మరే కారణాలతో ఏవైనా సమస్యలున్నా సత్వర పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నామని వివరించారు.
కార్యక్రమంలో అదనపు డిఆర్‌ఎం కె వేణుగోపాలరావు కూడా మాట్లాడారు. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లారుూస్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరి వై కొండలరావు స్వాగతోపన్యాసం చేశారు. ట్రాఫిక్ విభాగానికి చెందిన అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సీతాశ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.