విజయవాడ

ఇష్టంగా చేస్తే మ్యాథ్స్ పెద్ద కష్టం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 6: ఆంధ్ర లయోలా కళాశాలలో మంగళవారం డిగ్రీ విద్యార్థులకు అష్టావధానం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రఖ్యాత గణితవేత్త టిఎస్‌విఎస్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గణితమంటే విద్యార్థులు భయపడతారని, అయితే గణితంను కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే పెద్ద కష్టం కాదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో గణితం ముఖ్యభూమిక పోషిస్తుందన్నారు. పోటీ పరీక్షల్లో నెగ్గలాంటే గణితం చాల ముఖ్యమన్నారు. అనంతరం సమస్యపూరణం, వారగణం, దత్తాకం, నిషిద్దాంకం, మనసంకలనం, ఘనమూలం, ఆవృత దశాంశం, సరసప్రసంగం గురించి విద్యార్థులకు ఆయన వివరించారు. కళాశాల కరస్పాడెంట్ ఫాదర్ ఎస్.రాజు, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ మెల్కియర్, గణితశాస్త్రం హెచ్‌ఓడి ఫాదర్ విక్టర్ ఇమ్మానియేలు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎం. ఆరోక్యసామి, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.
యువతకు అంబేద్కర్ ఆదర్శం:తల్లాప్రగడ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ యువతకు ఆదర్శనీయుడని నగర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ తల్లాప్రగడ సుబ్బారావు కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం బాప్టిస్ట్‌నగర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ చదువుకోవడానికి కనీస సౌకర్యాలు కూడా లేని రోజుల్లో అంబేద్కర్ పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారని పేర్కొన్నారు. పిసిసి లీగల్ సెల్ కన్వీనర్ గంజి కిరణ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం యువకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు మింటె కనకయ్య, వణుకూరు బుల్లి బాపయ్య, బి.పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
క్రీడా విధానం చర్చకు వచ్చేనా?
* నేడు శాఫ్ ‘స్పోర్ట్స్ డ్రాఫ్ట్ పాలసీ’పై చర్చ
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాఫ్) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర స్పోర్ట్స్ డ్రాఫ్ట్ పాలసీపై చర్చ జరగనుంది. చర్చకు ఇప్పటికే పలు క్రీడా సంఘాలకు ఆహ్వానం అందినప్పటికీ, కొన్ని క్రీడా సంఘాలకు ఆహ్వానం అందలేదని సమాచారం. దీంతో క్రీడాసంఘాల వారు బుధవారం మిగతా క్రీడాసంఘాలను కలుపుకుని చర్చా కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఒలింపిక్స్ సంఘంలో నెలకొన్న వివాదాల కారణంగా క్రీడాసంఘాలు కూ డా రెండు గ్రూపులుగా విడిపోయా య. క్రీడా పాలసీపై చర్చకు అందరూ వస్తారా, లేక ఒక మాటపై అందరూ కలసి ఆగిపోతారా..అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శాఫ్ అధికారులు ఏవరినీ కలుపుకోకుండా వెళ్ళుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు తెలంగాణ బాడ్మింటన్ సంఘ కార్యదర్శి పి గోపిచంద్‌తో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఎంఒయు చేసుకుంటున్నరంటూ అది ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతో మంది క్రీడా ప్రముఖులు ఉన్నప్పటికీ తెలంగాణకు చెందిన గోపిచంద్‌కు రాష్ట్ర క్రీడాభివృద్ధి పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ ఇప్పటికే వ్యతిరేక వచ్చిన క్రమంలో శాఫ్ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదిఎమైనా బుధవారం చర్చ ప్రారంభమయ్యేంత వరకు ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని క్రీడాసంఘాల ప్రతినిధులు శాఫ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగారరాజును మంగళవారం కలిసి తమ అభ్యంతరాలు తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఆయన సానుకులంగా స్పందించినట్లు తెలిసింది.