విజయవాడ

జయలలిత అంత్యక్రియలు శాస్త్ర విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: తమిళనా డు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అంత్యక్రియలు శాస్త్ర విరుద్ధంగా జరి గాయని, శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ జ్యోతిష్య నిపుణు లు, ములుగు రామలింగేశ్వర వరప్రసా ద్ అభిప్రాయపడ్డారు. అంతిమ సం స్కారాన్ని సహచరురాలు శశికళ చేప ట్టడం సరైనది కాదన్నారు. శాస్ర్తియం గా స్ర్తిలు అంత్యక్రియలు చేసే అవకా శం లేదని, తర్పణం ఇవ్వడానికి, మట్టి చేయడానికి, అగ్ని సంస్కారం చేయ డానికి, పిండాలు పెట్టడానికి, యజ్ఞ యాగాది క్రతువులు చేయడానికి, గా యత్రి మంత్రం జపించడానికి అధికా రం లేదని తెలిపారు. స్ర్తిల కోసం నిర్దేశించబడిన వ్రతాలు, నోములు, పూజలు ఎన్నో వున్నాయి. వాటిని స్ర్తిలు నిరభ్యంతరంగా చేయవచ్చని, అసలు స్మశానంలోకి అడుగుపెట్టే అధికారం స్ర్తిలకు లేదని, సూర్యాస్తమయం తరు వాత ఖననం చేయడం కూడా నిషి ద్ధమేనని తెలిపారు. ఇవన్నీ శాస్త్ర గ్రం థాల్లో, వేదాల్లో చెప్పబడిన విషయాల ని తెలిపారు. 2016 శుభతిథి పం చాంగంలో (పేజి నెం.280) ముఖ్య నాయకల నిర్యాణం - దేశంలో విషాద దినాలు అని కూడా చెప్పడం జరిగిం దని పేర్కొన్నారు.

పిబి సిద్ధార్థ కళాశాలలో
15న అంతర్ కళాశాలల పోటీలు

విజయవాడ, డిసెంబర్ 8: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 15న అంతర్ కళాశాలల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. నగర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విజయవాడలోని వివిధ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొని లీమస్ 2కె16 కార్యక్రమం ద్వారా వాట్ యూసీ (ఏదైనా చిత్రంపై తక్షణం ఉపన్యాసం), స్పెల్ బీ (ఆంగ్ల పదాల స్పెల్లింగ్ పోటీ), బ్రోచర్ ప్రజంటేషన్, ఫ్లోర్ క్రాసింగ్ (వక్తృత్వ పోటీ), బజ్ (టెలిఫోన్ సంభాషణ పోటీ), షేర్ ఇట్ (తెరపై చూపించిన చిత్రాలను ఉపయోగించి కథా రూపకల్పన), మిష్టర్ అండ్ మిస్ లీమస్ (వ్యక్తిత్వ పోటీ) అంశాల్లో పోటీపడతారని తెలిపారు. కళాశాల డైరక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో లీమస్ 2కె16 కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించినట్లు, దీనికి విశేష స్పందన లభించటంతో ఈ సంవత్సరం కూడా విభిన్న అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటి నిర్వహణ ద్వారా తమ కళాశాల విద్యార్థులకు నిర్వహణా సామర్థ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యం అభివృద్ధి చెందుతాయని, ఇతర కళాశాలల విద్యార్థులకు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకోవటానికి ఈ పోటీలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. లీమస్ 2కె16 కన్వీనర్ ఆంగ్ల శాఖ ఉప విభాగాధిపతి ఆర్ దీప మాట్లాడుతూ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన ఆసక్తి కలిగిన విద్యార్థులు డిసెంబర్ 15న ఉదయం 9గంటలకు కళాశాలలో తమ పేర్లను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ 8న జరిగిన పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి బాబూరావు, డైరెక్టర్ వేమూరి బాబూరావు, పోటీల కన్వీనర్ దీప, ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ శ్రీలత, కార్యనిర్వాహక వర్గంలోని విద్యార్థులు పి వినీత్, ఎం శరత్ పాల్గొన్నారు.

చిన్ననోట్లపై ప్రజల ఆందోళనకు మద్దతు

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలో 500, 1000ల నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వామపక్ష నేతల సమావేశం విమర్శించింది. కొత్తగా వచ్చిన 2వేల నోట్లకు చిల్లర దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొంది. ప్రజలు చేస్తున్న ఆందోళనలకు సమావేశం మద్దతు తెలిపింది. కార్యాలయంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారురావు అధ్యక్షతన వామపక్షాల నేతల సమావేశం జరిగింది. క్యూబా విప్లవ నేత, ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మృతికి సంతాపం ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని, ముఖ్యమంత్రి, అధికారులు రెయిన్ గన్స్‌తో పంటలు కాపాడామని గొప్పలు చెబుతున్నా ఆచరణలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరుగుతున్న కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయన్నారు. సమావేశంలో సిపిఎం తరపున పి మధు, వై వెంకటేశ్వరరావు, సిపిఐ తరపున కె రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జల్లి విల్సన్, సిపిఐ (ఎంఎల్) తరపున జి విజయకుమార్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తరపున రామారావు, తదితరులు పాల్గొన్నారు.