విజయవాడ

సెంట్ పీటర్స్ కథెడ్రల్ చర్చి కూల్చివేత అనుచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 8: నగరంలో 120 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సెంట్ పీటర్స్ కథెడ్రల్‌ను కూల్చివేయాలన్న ప్రభుత్వ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఉదయం చర్చి వద్ద క్రైస్తవులు ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా విజయవాడ కతోలిక పీఠం వికర్ జనరల్, సెంట్ పీటర్స్ కథెడ్రల్ విచారణకర్తలు ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ పురాతనమైన హిందూ దేవాలయాలను పరిరక్షిస్తున్న ప్రభుత్వం ప్రసిద్ధి చెందిన చర్చిలను కూడా కాపాడాల్సి వుందన్నారు. మూడు నెలల క్రితం రోడ్డు అభివృద్ధి పేరుతో ఇదే చర్చి ప్రాంగణం గోడను విఎంసి అధికారులు కూల్చివేశారని, తాజాగా చర్చిని కూల్చాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించటం చూస్తే ప్రజాస్వామ్యంలో వున్నామా, నియంతృత్వ పాలనలో ఉన్నామా అనిపిస్తోందన్నారు. క్రైస్తవుల ఆస్తులను, మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. 200 సంవత్సరాల క్రితమే దేశంలో క్రైస్తవ సంస్థలు విద్య, వైద్య రంగాల్లో కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్నాయని, నేడు ప్రభుత్వం చర్చిలను కూల్చటం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రభుత్వం విచక్షణా జ్ఞానం లేకుండా క్రైస్తవులపై కక్షగట్టినట్లుగా చర్చిలను కూలదోయటం మానుకోవాలని కోరారు. చర్చి కూల్చివేతను విరమించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమించటానికి కూడా క్రైస్తవులు వెనకాడరని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీటర్స్ చర్చి సహాయ గురువు జాన్‌బాబు, చింతా చిన్నప్ప, వెలటూరి జాన్సన్, లకమాల రామారావు, కాలే సురేష్, చెన్ను రమేష్, చెన్ను రవి, సంఘస్తులు పాల్గొన్నారు.