విజయవాడ

ప్రశాంతంగా నామినేషన్ల ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: ఎపిఎస్ ఆర్టీసీలో కార్మిక వర్గానికి ఎంతో కీలకమైన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సిసిఎస్) ఎన్నికలకు సంబంధించి గురువారం సాయంత్రం నామినేషన్ల ఘట్టం ముగిసింది. 9మంది డైరెక్టర్లతో కూడిన పాలకవర్గం ఏర్పాటుకు రాష్టవ్య్రాప్తంగా 236 మంది ప్రతినిధులను ఎన్నుకోటం కోసం ఈ నెల 16న ఎన్నికలు జరుగబోతున్నాయి. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 13న పోటీదారుల తుది జాబితా వెలువరిస్తారు. 16న ఎన్నికలు జరుగుతాయి. ఐదేళ్లకోసారి ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. మొత్తం 56వేల మంది కార్మికులు, ఉద్యోగులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు 155 యూనిట్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మాలకొండయ్య, సిసిఎస్ సెక్రటరీ రాఘవరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ డిపోలు, కీలకమైన గ్యారేజ్‌లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. ప్రస్తుతం ఈ సొసైటీలో రూ.900 కోట్ల 30 లక్షల మూలధనం వుంది. ప్రాధాన్యత ప్రకారం దరఖాస్తుదారులకు రుణ సహాయం లభిస్తుంది. ఇక ప్రతినెలా కార్మికుల మూలవేతనంలో 8శాతం పొదుపు కింద ఈ సొసైటీలో జమ అవుతుంది. దానిపై 10శాతం వార్షిక చక్రవడ్డీ జమ అవుతుంటుంది. ఇదిలావుండగా రాష్ట్ర విభజన తర్వాత ఇటీవలే హోరాహోరీగా జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ 709 ఓట్ల ఆధిక్యంతో అధికారంలో వున్న ఎంప్లారుూస్ యూనియన్‌పై అనూహ్య రీతిలో విజయం సాధించింది. ఆధిక్యత తక్కువే అయినప్పటికీ మొత్తం 120 సంఘాల్లో 11చోట్ల ఎన్‌ఎంయు గుర్తింపు సాధించింది. గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మిక సంఘాలన్నీ ఒంటరిగా తలపడ్డాయి. ఎన్‌ఎంయుకు 25వేల 600 ఓట్లు రాగా ఇయుకు 25వేల ఓట్లు లభించాయి. ఇక టిడిపి అనుబంధ టిఎన్‌టియుసికి 2400 ఓట్లు, సిఐటియు అనుబంధ ఎస్‌డబ్ల్యుఎఫ్‌కు 2వేల ఓట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్‌కు 1200 ఓట్లు లభించాయి. అయితే సిసిఎస్ ఎన్నికల్లో ఎన్‌ఎంయుకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి పోరాడుతున్నాయి. అయినప్పటికీ ఇటీవలి కాలంలో తమ సభ్యత్వం మరో 8వేలకు పెరిగినందున విపక్షాలన్నీ ఏకమైనా తమకు ఇబ్బందేమీ లేదని ఎన్‌ఎంయు అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసులు, ముఖ్య ఉపాధ్యక్షులు డి సూర్యప్రకాశరావు ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో అన్నారు. గత ఎన్నికల్లోనే ఇయు నేతలు పెరిగిన 43 శాతం పిఆర్‌సి తమ ఘనతగా చెప్పకున్నప్పటికీ కార్మికులు తమకే పట్టం గట్టారన్నారు. కొద్దినెలల్లోనే తాము కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయించగలిగామన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం మరణించిన కార్మికుల పిల్లలకు దాదాపు 261 మందికి ఉద్యోగాలిప్పించామన్నారు. సిసిఎస్ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే సభ్యులకు రూ.10లక్షల బీమా వర్తింపచేస్తామన్నారు. ప్రతి జిల్లాలో సూపర్‌బజార్లు ఏర్పాటు చేయిస్తామని వారు వివరించారు. గతంలో ఆర్టీసీ ఇబ్బందుల్లో వున్నప్పుడు రెండేళ్లపాటు కార్మికుల జీతాల నుంచి వసూలు చేసిన పొదుపు సొమ్మును సిసిఎస్ ఖాతాలో జమచేయకుండా వాడుకోటం, దానిపై కార్మికులు ఆందోళనలు చేయటం జరిగాయి. ఈలోగా సిసిఎస్ బ్యాంకుల నుంచి వడ్డీపై తీసుకొచ్చి కార్మికులకు రుణాలు మంజూరు చేయాల్సి రావటంతో ఎంతో నష్టం జరిగిందని ఎన్‌ఎంయు నేతలు ఆరోపిస్తున్నారు. ఇకముందు అలా జరగకుండా చూస్తామని వారు వివరించారు.

సచివాలయంలో ‘్భయో’మెట్రిక్!
* విద్యా సంవత్సరం ముగిశాకే అంటున్న ఉద్యోగులు

విజయవాడ, డిసెంబర్ 8: వెలగపూడి సచివాలయంలో ఉద్యోగుల రాకపోలకు సంబంధించి బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని బ్లాక్‌ల్లో ఇందుకు సంబంధించిన యంత్రాలను అమర్చారు. ఉద్యోగుల వివరాలను దానికి ఫీడ్ చేస్తున్నారు. జనవరి నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే అధికారుల ప్రతిపాదనపై ఉద్యోగ వర్గాలు వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విద్యా సంవత్సరం మధ్యలో ఉందని, చాలా మంది ఉద్యోగులు హైదరాబాద్‌లో తమ కుటుంబాన్ని, పిల్లలను ఉంచి ఇక్కడ ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే సమయంలో సచివాలయానికి రావడంలో కొన్ని సందర్భాల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం ముగిశాకే ఈ విధానంలో హాజరు నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు త్వరలో సిఎంను కలిసి ఈ అంశాన్ని వివరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.