విజయవాడ

రైటర్ ఆత్మహత్య ఘటనలో సిఐపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 18: విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో సంచలనం రేపిన గన్నవరం పోలీసుస్టేషన్ రైటర్ డేవిడ్‌రాజు ఆత్మహత్య ఘటనలో సిఐ అహ్మద్ అలీపై వేటుపడింది. ఇక్కడ సిఐగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన సిఐ వేధింపులే రైటర్ ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ఆదివారం ఆదేశించారు. స్టేషన్ రైటర్‌గా పనిచేస్తున్న డేవిడ్‌రాజు పోలీసువర్గాల్లో వివాదరహితునిగా, నిజాయితీ ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. శనివారం స్టేషన్ విధులకు హాజరైన రైటర్ సర్వీస్ రివాల్వర్‌తో పురుషోత్తపట్నం, ముస్తాబాద్ రహదారిలోని పొలాల్లో రివ్వాలర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. స్టేషన్‌కు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్న రైటర్ సిఐ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలే ఆరోపించడం గమనార్హం. ఈ ఘటనను పురస్కరించుకుని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సిఐ అహ్మద్ అలీని సస్పెండ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేసుల్లో జరిమానాలు, జప్తు చేసిన నగదు లక్షల్లో కోర్టుకు సమర్పించకుండా స్టేషన్‌లోనే ఉంచుకోవటం వల్ల నగదులో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. సిపి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కమిషన్లతో కాలయాపన
* రాజకీయాలకు అతీతంగా శాంతియుత పోరాటం
* పార్టీలకు అతీతంగా జాక్...
* కెటిబి సమావేశంలో అన్ని పార్టీల నేతల తీర్మానం
బెంజిసర్కిల్, నవంబర్ 18: రాజకీయంగా...సామాజికంగా...ఆర్థికంగా రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్న కాపులను బిసి జాబితాలో చేర్చేందుకు అందరూ, పార్టీలు, రాజకీయాలు, సంఘాలతో సంబంధం లేకుండా సమష్టిగా ముందుకు రావాలని కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఉన్న బిసి వర్గాలు అందరూ లేని వాళ్లే అయితే ఉన్న రిజర్వేషన్లలోనే అందరం కలసి పంచుకునేందుకు మమ్మల్ని కూడా అందులో చేర్చు కోవాలన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం ఎవరిని నొప్పించేది కాదని, రిజర్వేషన్లు సాధించుకునేందుకు అన్ని పార్టీల నాయకులను, ప్రజలను భాగస్వాములను చేస్తూ శాంతియుతంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దాం అని ఏకాభిప్రాయానికి వచ్చారు. కెటిబి సంక్షేమ సమాఖ్య అధ్వర్యంలో ఆదివారం నగరంలో అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, రాష్ట్రంలోని అన్ని కాపు సంఘాలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం సమావేశం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా అమోదించింది. వీటి వివరాలను కెటిబి సంఘం కన్వీనర్ మాజీ డిజిపి భాస్కరరావు విలేఖర్లకు వివరించారు. ముఖ్యంగా అన్ని పార్టీల నాయకుల అభిప్రాయలకు అనుగుణంగా జెఎసిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాజకీయ నాయకులు లేకుండా జెఎసిని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గతంలో 1957లో ఉన్న రిజర్వేషన్లను ఆర్ధాంతరంగా రద్దు చేసిన విధానం, జివో నెం 30ని పునరుద్ధరించే విధానంతో పాటు, కమిషన్ నిర్ణయంతో కోర్టులో న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన సమగ్ర నివేదికను సిఎం చంద్రబాబును కలిసి అందజేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా మంజునాథన్ కమీషన్‌కు స్పష్టమైన కాలపరిమితిని విధించి రిపోర్టును అనుసరించి రిజర్వేషన్లు కల్పించే విధానం గాని, జివో నెం 30ని తిరిగి పునరుద్ధరించే విధానంపై సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, హైకోర్టు న్యాయవాదులను అభిప్రాయాలను తీసుకుని న్యాయపరమైన చిక్కులు లేకుండా సమగ్ర నివేదికను త్వరలోనే సిఎంకు జెఎసి అందజేస్తుందన్నారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని అందరూ రాజకీయ కోణంలో చూస్తున్నారే తప్ప సామాజిక పరంగా పరిగణించడం లేదన్నారు. అయితే పొలిటికల్ లాబియింగ్ ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తోందని భావించి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ సమష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని, ఇందుకు అన్ని పార్టీల నేతలు ఎకతాటి పైకి వచ్చి ముందుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో రిజర్వేషన్లు ఇస్తాం అంటూ అనంతరం కమీషన్‌లను ఏర్పాటు చేసి కాలయాపన చేస్తున్నారే తప్ప న్యాయం జరగడం లేదన్నారు. రాజకీయంగా కాపులు బలంగా ఉన్నారనే ప్రకటనపై స్పందించిన ఆయన రాష్టవ్య్రాప్తంగా ఉన్న కాపుల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే సమతుల్యత లేదన్నారు. కాపులు 90 శాతం నిరుపేదలగానే జీవనం సాగిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. వారు అన్ని విధాలుగా పైకి రావడానికి వారికి రిజర్వేషన్లు ఉతమిస్తాయన్నారు. విద్యాపరంగా వారికి రిజర్వేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే వారు ఆర్థికంగా పైకి వచ్చేందుకు ప్రైవేట్ సెక్టార్‌లో కూడా చేయూతను అందించాల్సి ఉందన్నారు. బిసిలను ఇబ్బంది పెట్టి వారి నోరుకొట్టి మాకు ఇవ్వమని అడగడం లేదన్నారు. కొందరు అవగాహన లేకుండా దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన రిజర్వేషన్లను పునరుద్ధరించమని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ప్రభుత్వానికి అవసరమై సలహాలను సూచనలను మాత్రం తప్పకుండా జెఎసి ఆధ్వర్యంలో అందరం కలిసి త్వరలోనే సిఎంకు అందిస్తామన్నారు. కాపు రిజర్వేషన్ అంశం కేవలం సామాజిక పోరాటంగానే పరిగణించాలి తప్ప రాజకీయ కోణంలో చూడవద్దన్నారు. తుని ఘటనకు స్పందించిన ఆయన కొందరు యువతకు తప్పుడు సంకేతాలు ఇవ్వడంతో ఆ సంఘటన చోటు చేసుకుందని, దానికి బాధ్యులైన వారు తప్పకుండా శిక్షణను అనుభవించాల్సిందేనన్నారు. ఈ సమావేశంలో మాజీ ఐఎఎస్ కెవి రావు, తెలుగుదేశం పార్టీ నుండి ఎంపి అవంతి శ్రీనివాస్, బొండా ఉమా, బిజెపి నుండి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఆకుల శ్రీనివాస్, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ చెంగల్రావు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సామినేని ఉదయభానుతో పాటు అన్ని జిల్లాలకు చెందిన కాపు సంఘాల నేతలు పలు పార్టీల ఇతర నేతలు హాజరయ్యారు.