విజయవాడ

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 22: అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమని, అవి రెండూ తనకు కళ్లు వంటివని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ రెండూ సమాంతరంగా పయనించినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. నిధులను సమీకరించి అవసరమైన శాఖల్లో వెచ్చించడం ద్వారా అత్యుత్తమ విధానాన్ని పాటిస్తున్నామని చెప్పారు. నిధుల సమర్థ వినియోగం ద్వారా ధనికులు, పేదల మధ్య అంతరం తొలగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ల సదస్సు రెండోరోజు గురువారం వివిధ శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ జనవరి నుంచి అందించాలని ఆదేశించారు. క్రిస్మస్ కానుక, చంద్రన్న కానుక, రంజాన్ తోఫా పంపిణీలో జన్మభూమి కమిటీ సభ్యుల సహాయం తీసుకోవాలన్నారు. చంద్రన్న కానుకల్లో 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కానుకలు ఇవ్వడంపై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, ప్రజల్లో సంతృప్తి శాతం ఇంకా పెరగాలి, ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖపైనా సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వంద శాతం విద్యుత్ లక్ష్యాన్ని సాధించామని, ఈ ఏడాది పొగలేని వంటఇల్లు లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని కొండ, గిరిజన ప్రాంతాల్లో 5కేజీల సిలిండర్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించండని ఆదేశించారు. పంట వచ్చిన 15 రోజుల్లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. క్రమేపి ఆ సమయాన్ని 7రోజులకు కొనే స్థాయికి చేరుకోవాలని, రేషన్ షాపుల్లో కొలతల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ డీలర్లు ప్రజలతో వ్యవహరించే తీరును కూడా పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 9,07,083 మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందించామని, సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయాన్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. అత్యున్నత వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖలో ఆశించిన ఫలితాలు రావడం లేదని, వైద్యశాఖలో ప్రతిఒక్కరూ బాధ్యతలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 42.04 లక్షల మందికి 1.3 కోట్ల రోగ నిర్థారణ పరీక్షలు నిర్వహించాయని, వీటివల్ల ప్రజలకు రూ.208 కోట్లు ఆదా అయ్యాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మార్చుతున్నాయని, విశాఖలో అంగన్‌వాడీలకు తానా కోటి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిందని చంద్రబాబు వివరించారు.