విజయవాడ

సెంటినీ ఆసుపత్రిలో అగ్నిజ్వాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 3: జాతీయ రహదారి వెంబడి గల సెంటినీ కార్పొరేట్ ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొత్తం నాలుగు ఫ్లోర్‌లను మంగళవారం మధ్యాహ్నం కొన్ని నిమిషాలపాటు అగ్నికీలలు చుట్టుముట్టి రోగులు, వైద్యులనే కాక పరిసర ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసాయి. క్షణాల్లో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో కేవలం 30 నిమిషాల్లోనే మంటలను అదుపుచేసినప్పటికీ ప్రధాన ద్వారం, కిటికీ తలుపులే కాక వెంటిలేటర్లు కూడా లేకపోవడంతో దాదాపు గంటన్నర సమయం ఆసుపత్రి లోపలి ప్రాంతమంతా పొగతో నిండి ఉక్కిరిబిక్కిరి చేసింది.. ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. దీనికి తప్పిదం ఎవరిదైనా అదృష్టవశాత్తూ ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. అన్నింటి మించి ఆ సమయంలో ఆపరేషన్లు జరుగటం లేదు. ఐసియు, ఇతర గదుల్లోనూ ఇన్‌పేషెంట్లు 52 మంది ఉండగా ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది తోడ్పాటుతో ఆ రోగులందరినీ ఆఘమేఘాలపై పరిసరాల్లోని రమేష్ కార్డియాక్, ఆయుష్, ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఓపిలో వున్న వారందరినీ తొలుతే వెలుపలకు పంపించడం జరిగింది.
నిబంధనల మేరకు అగ్నిమాపక శాఖ తుది క్లియరెన్స్ తర్వాతే నగరపాలక సంస్థ ఆ కట్టడం వినియోగంలోకి అనుమతించాల్సి వచ్చింది. అయితే గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి చివరి నాలుగో అంతస్తు వరకు కూడా ఎక్కడా కిటికీ తలుపులే కాదు కనీసం అత్యవసర ద్వారాలు, వెంటిలేటర్లు కూడా లేకుండా అద్దాలతో అన్ని అంతస్తులను దిగ్బంధించేయటంతో మంటలు అరగంటలో ఆరిపోయినా పొగ మాత్రం ఎటూ వెలుపలకు వెళ్లటానికి ఎలాంటి దారి లేక సుడులు సుడులు తిరుగుతూ దట్టంగా పొగ ఎక్కడికక్కడే నిలిచింది. వాస్తవానికి మంటలు కంటే ఈ పొగ మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. పలు రకాలైన వ్యాధులకు ఈ పొగ దారితీయగలదంటున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ధైర్యంతో వరుసగా అన్ని అంతస్తుల్లోనూ అద్దాలన్నింటినీ పగులగొట్టిన తర్వాత గాని పొగ పూర్తిగా వెలుపలకు వెళ్లలేదు. దీంతో ప్రాణగండం తప్పటంతో అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఒక గదిలో పవర్ సప్లయ్ యూనిట్, యుపిఎస్ ఉంది. ఎప్పుడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే సెకన్లలోనే యుపిఎస్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. సరిగా ఇది జరిగినప్పుడు ఆ సమయంలో పెద్ద పేలుడు సంభవించడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడగా వచ్చిన మంటలతో ముందుగా సీలింగ్ తగులబడింది. క్షణాల్లో ఆ మంటలు నాలుగో అంతస్తు వరకు పాకాయి. ఇన్‌చార్జి జిల్లా ఫైర్ ఆఫీసర్ బి.వీరభద్రరావు, అడిషనల్ ఫైర్ ఆఫీసర్ వి.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మూడు స్టేషన్‌ల నుంచి మూడు ఫైరింజన్లు హుటాహుటిన అక్కడికి చేరాయి. వెనువెంటనే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావటం జరిగింది. అనంతరం అగ్నిమాపకశాఖ డిజి సత్యనారాయణ, అడిషనల్ డైరక్టర్ రమణ, ప్రాంతీయాధికారి ఎస్‌వి చౌదరి తదితరులు ఘంఘటనా స్థలాన్ని సందర్శించి అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. అద్దాలు పగలటం వలన దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లింది.