విజయవాడ

చెక్కు చెదరని స్థానం టెలీఫోన్ డైరెక్టరీది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 17: సమాచార బట్వాడాలో నాటి నుంచి నేటి వరకు ఎన్ని వినూత్న, సాంకేతిక మార్పులు, విధానాలు వచ్చినా ఆధునిక యుగంలోనూ టెలిఫోన్ డైరెక్టరీ స్ధానం చెక్కు చెదరలేదని ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ కె దామోదరరావు అన్నారు. ఏపి కస్టమ్స్ శాఖ ప్రచురించిన ‘పాకెట్ టెలిఫోన్ డైరెక్టరీ’ని విజయవాడలోని కస్టమ్స్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాఖాపరంగా కస్టమ్స ఉద్యోగుల మధ్య సమాచారం ప్రసారానికి టెలిఫోన్ డైరెక్టరీ దిక్చూచి లాంటిదన్నారు. కస్టమ్సలో పారదర్శకత దిశగా ఇదొక ప్రధానమైన అడుగుఅన్నారు. కస్టమ్స ఉద్యోగుల టెలిఫోన్ నెంబర్లు తదితర సమాచారాన్ని అరచేతిలో ఆవిష్కరించే విధంగా రూపకల్పన చేయడం అభినందనీయమన్నారు. ఏపి కస్టమ్స కమిషనర్ ఎస్‌కె రహమాన్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా అన్ని కస్టమ్స్ కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన మొబైల్, ల్యాండ్‌లైన్, ఫ్యాక్స్ నెంబర్లు, ఇ మెయిల్స్, పోస్టల్ అడ్రస్‌లు తదితర వివరాలను సమగ్రంగా డైరీలో సమకూర్చడం జరిగిందన్నారు. శాఖాపరంగా ప్రతి ఉద్యోగి జేబులో అందుబాటులో ఉండేలా పాకెట్ టెలీఫోన్ డైరీని రూపొందించామని చెప్పారు. వృత్తిపరంగా సత్వర సమాచార సేకరణ, ఉద్యోగుల పనితీరులో వేగం పెంచడమే ఈ డైరెక్టరీ ప్రచురణ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. ఉద్యోగుల మధ్య అవినాభవ సంబంధాలను పెంపొందించేందుకు కూడా ఈ డైరీ దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా దామోదరరావును కమిషనర్ రహమాన్ ఙ్ఞపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్లు డి సతీష్, సిఎస్ రాజు, మురళీధర్, సూపరింటెండెంట్లు గుమ్మడి సీతారామయ్య చౌదరి, సామ్రాజ్యం, కెపి సాగర్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మారిస్‌స్టెల్లాలో ఊర్రూతలూగించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పటమట, జనవరి 17: స్థానిక మారిస్‌స్టెల్లా కళాశాల ఇంగ్లీషు డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ‘స్పార్క్‌లిట్ 2కె 17 పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అద్యంతం ఊర్రూతలుగీంచాయి. విద్యార్ధునులు మిస్ట్‌ర్, మిసెస్ స్పార్క్‌లిట్ నృత్యప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. 15 కళాశాలల నుండి వచ్చిన 100 మంది విద్యార్ధులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎల్‌ఎస్‌ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించటం వలన విద్యార్ధునులలోని దాగివున్న ప్రతిభాపాటవాలను వెలికితీయవచ్చన్నారు. వ్యక్తిత్వ వికాసానికి సాంస్కృతి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రేఖా మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్ధునులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా వారిని అన్ని రంగాలలో రాణించటానికి కళాశాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలపారు. వివిధ అంశాలలో గెలుపొందిన విజేతలకు ముఖ్యఅతిధి చేతులు మీదుగా బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాడెంట్ సిస్టర్ స్లీవ, ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.