విజయవాడ

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ప్రభుత్వ వైద్యాధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 20: అంగవైకల్య ధ్రువీకరణ పత్రానికి నివేదిక ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ వైద్యాధికారితోపాటు అతని సహాయకుడు అవినీతి నిరోధక శాఖాధికారులకు శుక్రవారం రాత్రి దొరికిపోయాడు. ఎసిబి డిఎస్‌పి వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ప్రభుత్వాసుపత్రి ఆర్ధోపెడిక్ విభాగం అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ పివి దశరయ్య తన ప్రైవేట్ క్లినిక్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఉయ్యూరుకు చెందిన కూచి సాయిరాం తన తండ్రి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అతనికి ప్రభుత్వం నుంచి సంక్రమించే ప్రయోజనాలు పొందేందుకు వైద్య ధ్రువీకరణ పత్రం అవసరమైంది. దీంతో ఇందుకు సంబంధించి నివేదిక కోసం డాక్టర్ దశరయ్యను సంప్రదించాడు. అయితే తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే పదివేల రూపాయలు లంచం ముట్టజెప్పాల్సిందిగా సదరు వైద్యాధికారి డిమాండ్ చేశాడు. ఇందుకు అంగీకరించిన సాయిసాం శుక్రవారం రాత్రి డాక్టర్ దశరయ్య నిర్వహిస్తున్న నక్కలరోడ్డులోని తన ప్రైవేట్ క్లినిక్‌కు వచ్చాడు. ఈ క్రమంలో సర్ట్ఫికెట్ కోసం దశరయ్యకు పదివేలు ఇచ్చేందుకు సిద్ధపడగా అప్పటికే అక్కడ వేచి వున్న ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న దశరయ్యను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా క్లినిక్‌లో దశరయ్య వద్ద పనిచేస్తున్న సహాయకుడు జాషువా కూడా వెయ్యి రూపాయల లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు. వీరిద్దరి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని డిఎస్‌పి గోపాలకృష్ణ తెలిపారు. నిందితులను శనివారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.

సాగునీటి సంఘాల బలోపేతం అవసరం
* చర్చా వేదికలో మంత్రి దేవినేని ఉమ
విజయవాడ, జనవరి 20: వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చటానికి సాగునీటి సంఘాలు బలోపేతం కావాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఆధ్వర్యంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి వినియోగదారుల సంఘాల బలోపేతంపై ఒక్కరోజు పూర్తిస్థాయి వర్క్‌షాపు, చర్చా కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నీటిసామర్ధ్య పెంపుదల పథకం (ఎపిడబ్ల్యుఎస్‌ఐపి) ప్రాజెక్టు డైరక్టర్ డా.పిఎస్ రాఘవయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సాగునీటి రంగంలో సామాజిక పరిజ్ఞానం కేవలం రైతుకే ఉంటుందనే ఉద్దేశంతో రాష్టవ్య్రాప్తంగా 6వేల సాగునీటి సంఘాలను ఒక అభిప్రాయంతో పునరుద్ధరించడం జరిగిందన్నారు. నీటి సంఘాల అధ్యక్షులు లాభాపేక్ష లేకుండా కేవలం రైతులకు సేవ చేసి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. నాగార్జునసాగర్ ఆధునికీకరణ పథకంలో 2010 నుండి 2014 వరకు గత ప్రభుత్వం హయాంలో రూ.800 కోట్లు ఖర్చు పెడితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2016 వరకు కేవలం రెండు సంవత్సరాల కాలంలో రూ.800 కోట్లు ఖర్చుచేసి నాగార్జునసాగర్ కాలువలను బాగుచేయడం జరిగిందని, నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జలాలను తీసుకురావడానికి ప్రణాళిక రచించామని, అది త్వరలో సాకారం అవుతుందని అన్నారు. పలువురు నీటి సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ కాలువల మీద నీటి యాజమాన్యం మరింతగా అమలు చేయడానికి ఖాళీగా వున్న లస్కరు పోస్టులు భర్తీ చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో అవకాశం కల్పించాలని నీటి సంఘం, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్టు కమిటీలకు సమావేశాలు నిర్వహించడానికి వీలుగా ఆధునికీకరణ పథకంలో పరిపాలనా భవనాలు వెంటనే మంజూరు చేయాలని, పూర్తయిన కాలువల కట్టల మీద జీపు ట్రాకుకు గ్రావెల్ వేయడానికి గ్రాంటు మంజూరుచేయాలని నీటి సంఘాలను మరింత బలోపేతం చేయడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో నీటి సంఘాల అధ్యక్షులను, మండల పరిషత్ సమావేశాల్లో డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగాను, జిల్లా పరిషత్ సమావేశాలకు ప్రాజెక్టు కమిటీ చైర్మన్లను, సంబంధిత జిల్లాలోని అపెక్స్ కమిటీ సభ్యులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడానికి చర్యలు తీసుకోవాలని వర్క్‌షాపు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వర్క్‌షాపులో జలవనరులశాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు వై.పుల్లయ్యచౌదరి, జివి భుజంగరాయులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు శ్రీనివాస్, ఎన్‌ఎస్‌పి సిఇ వి.వీర్రాజు, నీటిపారుదలశాఖ సలహాదారు చెరుకూరి వీరయ్య, రిటైర్డ్ ఇఎన్‌సి సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ రూపొందించిన నీటి సంఘాల వర్క్‌బుక్‌లను మంత్రి ఆవిష్కరించారు.