విజయవాడ

నాలెడ్జి హబ్‌గా ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 5: మీ సమస్యలు నేను పరిష్కరిస్తా.. అయితే మీ సహకారం తనకు సంపూర్ణంగా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఆదివారం ఉదయం ఆంధ్ర లయోలా కళాశాలలోని ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవవనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారుల, ప్రధానోపాధ్యాయులు సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో 16వేల కోట్లు ఆర్థికలోటు ఉన్నప్పటికీ ఉద్యోగులలకు 43శాతం ఫిట్‌మెంట్, ఉద్యోగుల వయోపరిమితి 60ఏళ్లకు పెంచానని గుర్తుచేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క విద్యకే రూ.21,500 కోట్లు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమని ఎక్కువ మొత్తంలో విద్యకు ఖర్చు చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్‌గా మార్చటమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2004 ఎన్నికల్లో ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు తనకు ఓటు వేయకపోవటంతో తమ ప్రభుత్వం ఓటమిపాలైందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా ఉంటుందని వారి సంక్షేమకోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు తీర్చిడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రభుత్వానికి ఉపాధ్యాయులు అండగా నిలబడాలన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడకుండా ప్రైవేటు రంగంలో ఉన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అధిక జీతాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఏవరికీ లేని యువ సంపద భారతదేశానికే సొంతం అన్నారు. ఇక్కడ యువతీ యువకులు తీర్చిదిద్దితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రప్ పాలనను ఆయన ప్రస్తావిస్తూ ట్రప్ అనుసరిస్తున్న విధానాలతో ప్రపంచ మొత్తం ఇబ్బందులు పడుతుందని, అమెరికాలో మన తెలుగువాళ్లు కూడా పోరాడుతున్నారని తెలిపారు. అందుకే ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. అమెరికాలో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారని, కానీ మనం విద్యార్థులను క్లాస్ రూమ్‌లకే పరిమితం చేస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో అన్ని స్కూల్స్‌లో డిజిటల్ క్లాస్‌లు ప్రవేశపెడతామని, హైస్కూల్స్‌కు కూడా వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి విద్యతోనే సాధ్యమన్నారు. అందుకు సిఎం చంద్రబాబు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంవత్సరానికి 21,500 కోట్లు విద్యకే ఖర్చుపెడటం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు, ఎంఇఓల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నారాయణ, రావెల కిషోర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఎమ్మెల్సీలు ఎఎస్.రామకృష్ణ, బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీ్ధర్, 13 జిల్లాల ఎంఇఓలు, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిరోజూ ఆనందంగా వుండాలి
* ఉత్సాహంగా హ్యాపీ సండే * కమిషనర్ వీరపాండియన్
విజయవాడ (స్పోర్ట్స్), ఫిబ్రవరి 5: ప్రతినెల మొదటి ఆదివారం ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించుటకు నిర్వహింపబడుతున్న హ్యాపీ సండే కార్యక్రమాలను ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్దనే కాకుండా బిఆర్‌టిఎస్ రోడ్డులో శారద కళాశాల జంక్షన్ వద్ద ఏర్పాటు చేయటం జరిగిందని, ముందుగా బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహించుట జరుగుతుందని, ఈ హ్యాపీ సండే కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న స్పందన మేరకు నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంలో భాగంగా నేడు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బిఆర్‌టిఎస్ రోడ్డు నందలి ఈ హ్యాపీ సండే కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ కార్యక్రమం విజయవాడ నగరంలోనే పుట్టిందని, ఇప్పడు రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్వహించటానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలందరూ ఈ ఒక్కరోజే కాకుండా ప్రతి నిత్యం ఆనందంగా ఉండేలా ఆలోచన విధానం మార్చుకొని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్ అన్నారు.
తదనంతరం బిఆర్‌టిఎస్ రోడ్డు నందు ఏర్పాటుచేసిన హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఇక్కడకు విచ్చేసిన యువకులను, విద్యార్థులను, ప్రజలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, ఇలానే అందరూ వారి వారి జీవితాల్లో ప్రతి క్షణం ఎంతో సంతోషంగా ఉండాలని కోరారు. ఎప్పుడు ట్రాఫిక్‌తో నిండిపోయే బిఆర్‌టిఎస్ రోడ్డు డీప్ ట్రస్టు వారు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆనందపరుస్తున్నాయని వారిని అభినందించటంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లలను అభినందించారు. ఇదే విధంగా నగరంలో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పోలీస్, శాప్ వారిని కూడా అభినందించారు. ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమాలను నిర్వహించటానికి నిర్వాహకులకు నగరపాలక సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎవరికి వారు తమ వీధుల్లో ఏరియాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొనవచ్చునని నగరపాలక సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఎంజి రోడ్డు నందు నిర్వహించిన కార్యక్రమంలో దగ్గరలో నివాసముంటున్న ప్రజలు మాత్రమే పాల్గొంటున్నారని కావున ఈ కార్యక్రమాన్ని వన్‌టౌన్ ప్రాంతంలోని కెటి రోడ్డులో కాని, క్రాంబే రోడ్డులో కాని ఏర్పాటు చేయుటకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ ఇక్కడ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆటలను ఆడుకుంటూ సంతోషంగా ఉండాలని, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి నిర్వహిస్తున్న డీప్ ట్రస్ట్ వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ సందర్భంలో నగరపాలక సంస్థ కమిషనర్‌కు విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నందున వారికి కృతజ్ఞతగా నలంద విద్యాసంస్థల తరపున నలంద డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అనురాధ పూల మొక్కను అందజేశారు.
కాగా నలంద విద్యాసంస్థ పాఠశాలలు, కళాశాల విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా స్కేటింగ్, షటిల్, త్రోబాల్, వాలీబాల్, యోగ, మెడిటేషన్, ఆయుర్వేద స్టాల్స్, ఇతర ఆట పాటలతో ప్రజలను ఆహ్లాదపరచుట జరిగింది. పై కార్యక్రమంలో కార్పొరేటర్లు కాకు మల్లికార్జున యాదవ్, గండూరి మహేష్, త్రిమూర్తి రాజు, విఏఎస్., సహాయ వైద్యాధికారులు, డీప్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్, నగరపాలక సంస్థ సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.