విజయవాడ

సమాజాన్ని మార్చగలిగే శక్తి విద్యతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: సమాజాన్ని మార్చగల శక్తి విద్యావంతులతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇంటర్నేషనల్ పేపర్ ఎపిపిఎం లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థినీ విద్యార్థులకు ‘ఐటి స్కాలర్‌షిప్ -2016’ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఎంజి రోడ్డులోని హోటల్ గేట్‌వేలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందన్నారు. పుస్తకం, పెన్ను, టీచర్, విద్యార్థి సమాజాన్ని మార్చడంలో కీలకపాత్ర వహిస్తారన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు. బడ్జెట్‌లో 21,500 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సౌకర్యాలు కల్పించి, విద్యార్థులకు చక్కని విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్ విభాగం) ద్వారా పాఠశాలలను దత్తత తీసుకుని సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని తెలిపారు. రాజమండ్రికి చెందిన ఇంటర్నేషనల్ పేపర్ సంస్థ పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు చక్కని విద్య అందించేందుకుగాను స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఇంటర్నేనల్ పేపర్ సంస్థను ఆదర్శంగా తీసుకుని మరిన్ని సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఇంటర్నేషనల్ పేపర్ ఇండియా ఫౌండేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ ప్రవీణ్ స్వామినాథన్ మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని దానిలో భాగంగా స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలోఇంటర్నేషనల్ పేపర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలపై దాడులను అరికట్టలేని బాబు
పాతబస్తీ, ఫిబ్రవరి 10: శుక్రవారం నుంచి జాతీయ మహిళా పార్లమెంట్ సాధికారిత సదస్సు ప్రారంభమవుతున్న సందర్భంగా విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో బండి పుణ్యశీల అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమం ఊరేగింపును వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మహిళలపై నిత్యం జరుగుతున్న దాడుల్ని అరికట్టలేని చంద్రబాబునాయుడు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అటువంటి వారికి మహిళా సాధికారత సదస్సు నిర్వహించడం హాస్యాస్పదమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైకాపా మహిళా కార్పొరేటర్లు, వైకాపా నాయకులు షేక్ గౌస్ మొహద్దీన్, శ్రీకాంత్, దుర్గారావు పాల్గొన్నారు.