విజయవాడ

మే నాటికి ప్రతి కుటుంబానికీ ‘దీపం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: మే మొదటి తేదీ నాటికి జిల్లాలో ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ అందించాలని జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు అధికారులను ఆదేశించారు. దీపం గ్యాస్ కనెక్షన్ల పంపిణీపై పౌర సరఫరాల శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు, డీలర్లతో శుక్రవారం జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అదే సమయంలో మండల యంపిడిఓలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా సమీక్షిస్తూ దీపం గ్యాస్ కనెక్షన్ల గ్రౌండింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. మే 1వ తేదీ నాటికి జిల్లాలోని ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ వుండాలన్నారు. నూరుశాతం లక్ష్యాలతో రెవెన్యూ, పౌర సరఫరాలు, డిఆర్‌డిఎ అధికారుల సమన్వయంతో మూడు నెలల కాలం శ్రమించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు లక్షా 65వేల 218 దీపం గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు ప్రజల నుండి దరఖాస్తులు రాగా నేటివరకు 1,15,829 దీపం కనెక్షన్లు గ్రౌండింగ్ జరిగాయని, ఇంకా 49,389 కనెక్షన్లు మంజూరు చేయవలసి వుందని జాయింట్ కలెక్టర్ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ వుండాలని నిర్ణయం మేరకు అధికారులు పనిచేయాలన్నారు. ఆయిల్ కంపెనీల వారీగా సమీక్షిస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తక్కువ స్థాయి ప్రగతి సాధన పట్ల వివరణ కోరారు.
లక్ష్యాల సాధనలో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తున్న విస్సన్నపేట, నందిగామ, బాపులపాడు, కలిదిండి, మోపిదేవి మండలాల అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి కొండలరావును జాయింట్ కలెక్టర్ అభినందిస్తూ ఇదే స్పూర్తిని లక్ష్యసాధనలో వెనుకబడిన మండలాల అధికారుల బృందం పనిచేయాలని కోరారు. మంజూరు చేసిన గ్యాస్ కనెక్షన్ల వివరాలను ఎప్పటికప్పుడు దీపం వెబ్‌సైట్ నందు అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సమస్యలు ఎదురయితే తమ దృష్టికి తీసుకురావాలని సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను కోరారు. వీడియో కాన్ఫరెన్స్, సమీక్ష సమావేశంలో పి.కోమలిపద్మ, పి.ప్రసాదరావు, అర్బన్ ఎఎస్‌ఓ ఉదయభాస్కర్, శ్యాంకుమార్ పాల్గొన్నారు.

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ అంపైర్‌గా
ఎల్‌ఐసి అధికారి రమణకుమార్
విజయవాడ(స్పోర్ట్స్), ఫిబ్రవరి 17: భారతీయ జీవిత బీమా సంస్థ, సూర్యరావుపేట కెరీర ఏజెంట్స్ విభాగం అధికారి డి.ఎన్.రమణకుమార్ ఢిల్లీలో ఈ 14 నుండి 19 వరకూ జరుగుతున్న ప్రపంచ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు అంపైర్‌గా ఎన్నుకోబడ్డారు. రమణకుమార్ జీవిత బీమా సంస్థలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాన్ని పొందటం జరిగింది. అఖిల భారత స్థాయిలో జరిగిన అనేక టోర్నమెంట్లలో ఆయన ఎల్‌ఐసికి ప్రాతినిధ్యం వహించారు. వరుసగా 1987, 88 సం.లో రజత పతకం సాధించారు. విద్యార్థిగా ఉన్న సమయంలోనూ ఆయన అఖిల భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం టీమ్‌కు 5 సం.లు కెప్టెన్‌గా పని చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లా కెప్టెన్‌గా కూడా ఆయన సేవలందించారు. 1983లో విశాఖపట్నం టీమ్‌కు ట్రోఫీ రావడంలో ఈయన పాత్ర ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ నుండి మొట్టమొదటి అంతర్జాతీయ అంపైర్‌గా ప్రాతినిధ్యం వహించిన ఘనత కూడా దక్కింది. అంపైర్‌గా ఈయన అనేక అఖిలభారత స్థాయి టోర్నమెంట్‌లో సేవలు అందించారు. అలిప్పీ(కేరళ), రాజమండ్రిలలో జరిగిన సబ్‌జూనియర్ నేషనల్స్‌లో ఈయన అంపైర్‌గా సేవలందించడం జరిగింది. సూరత్‌లో 2015లో జరిగిన కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కోసం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకోబడిన ఏకైక వ్యక్తి ఈయన కావడం మన రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయమని ఎల్‌ఐసి ఎంప్లారుూస్ స్పోర్ట్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జివిఎన్‌ఎల్ శర్మ, కొలుసు భాస్కరరావు పేర్కొన్నారు.
పిడిఎఫ్ అభ్యర్థులను బలపర్చండి
విజయవాడ, ఫిబ్రవరి 17: మార్చి 9న మన రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించమని ఎపి పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఎంప్లారుూస్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, అధ్యక్షులు గోపాలరాజు, ప్రధాన కార్యదర్శి రత్నరాజు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వేతన పెంపు, కొనసాగింపు తదితర సమస్యల పరిష్కారానికై పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించవల్సిందిగా కోరారు.