విజయవాడ

అంతర్జాతీయ మహిళగా చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), ఫిబ్రవరి 21: శే్వతసౌధ స్వప్నం చెదిరినా అమెరికన్ ప్రజా జీవితంలో హిల్లరీ క్లింటన్ మిక్కిలి ప్రజాదరణ పొందిన నాయకురాలిగా, మానవతావాదిగా, స్ర్తివాదిగా చెక్కుచెదరని స్థానం పొందారని పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. విజయవాడ కల్చరల్ సెంటర్‌లో మంగళవారం రాత్రి యార్లగడ్డ రచించిన ‘చెదిరిన శే్వతసౌధ స్వప్నం-హిల్లరీ క్లింటన్’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ విశిష్ఠ వ్యక్తులపై విలక్షణ రచనలు చేయటం లక్ష్మీప్రసాద్‌కే చెల్లుతుందన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మాజీ ఎంపి చెన్నుపాటి విద్య తమ ప్రసంగాల్లో హిల్లరీ క్లింటన్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ రచయిత లక్ష్మీప్రసాద్‌ను అభినందించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం మాజీ సంచాలకులు మంజులూరి కృష్ణకుమారి, ప్రముఖ రచయిత్రి పాటిబండ్ల రజని మాట్లాడుతూ హిల్లరీ క్లింటన్ ఉగ్రవాదం, స్ర్తిలు, బాలల హక్కులు, మానవతా విలువలపై అద్భుత ప్రసంగాలు చేసి అంతర్జాతీయ మహిళగా గుర్తింపు పొందారన్నారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ హిల్లరీ ఎప్పుడూ మొక్కవోని ధైర్యంతో ఉండటమే కాకుండా తడబడి పడిపోతే కుంగిపోకుండా మళ్లీ బలంగా లేచి నిలబడమనే సందేశం ఇచ్చారన్నారు. ఆమె ఒక ఉక్కు మహిళ అన్నారు. వెన్నా వల్లభరావు సభకు స్వాగతం పలుకగా కల్చరల్ సెంటర్ సిఇవో డా. ఈమని శివనాగిరెడ్డి, తమ్మా శ్రీనివాసరెడ్డి, బుద్ధవిహార కార్యదర్శి శుభకర్ మేడసాని, తదితరులు ప్రసంగించారు.

మరో 37మంది ఈవ్‌టీజర్లకు కౌనె్సలింగ్

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 21: నగరంలో మహిళలు, యువతుల పట్ల వేధింపులకు పాల్పడుతున్న ఈవ్‌టీజర్లకు మంగళవారం పోలీసులు కౌనె్సలింగ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు స్వేచ్ఛగా తిరిగేందుకు వారికి పోకిరీల నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటైన ‘మహిళా రక్షక్’ బృందాల పనితీరు సత్ఫలితాలిస్తోంది. సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి ఆయా చోట్ల మహిళా రక్షక్ బృందాలు నిఘా వేస్తున్నాయి. దీనిలో భాగంగా మహిళా సిబ్బంది మఫ్టీలో సంచరిస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఈక్రమంలో పలుచోట్ల నగరంలో పట్టుబడిన ఈవ్‌టీజర్లు సుమారు 37మందిని మహిళా రక్షక్‌లు అదుపులోకి తీసుకున్నాయి. వీరందరికీ వాసవ్య మహిళా మండలిలో మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబ వ్యవస్థ ఉంటుందని అందులో తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు అనే బంధాలు ఉంటాయని, ఈవ్‌టీజింగ్ చర్యలు కుటుంబ సభ్యులు కూడా సహించరన్నారు. ఈవ్‌టీజింగ్ వల్ల మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం, చేస్తున్న ఉద్యోగాలు మానేసి కొన్ని సందర్భాల్లో బయటకు రావడానికి కూడా భయపడే దుస్ధితి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా పరివర్తన చెందాలని ఈవ్‌టీజర్లకు హితవు కౌన్సిలర్లు హితవు చెప్పారు.