విజయవాడ

ప్రత్యేక హోదా కోసం పోరాడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 6: రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాల కోసం విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక తరగతి హోదా సాధనకు పోరాడుదామంటూ సిపిఐ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. ప్రత్యేక తరగతి సాధనలో ప్రభుత్వం వహిస్తున్న అలక్ష్యానికి నిరసనగా రాష్ట్రంలో తొలిసారిగా వెలగపూడిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో తొలిరోజు జరిగిన రాష్ట్ర గవర్నర్ ప్రసంగ సమయంలో తన సీటు వద్ద ‘ప్రత్యేక తరగతి కోసం పోరాడుదాం’ అంటూ ప్లకార్డును ప్రదర్శిస్తూ నిలుచొని గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకూ ప్రభుత్వానికి తన వాదన ప్రదర్శించిన ఆయన అనంతరం విలేఖరులతో రాష్ట్ర ప్రత్యేక తరగతి సాధనకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈవిషయంలో ప్రభుత్వం అఖిలపక్షం వేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అమరావతి భవన డిజైన్లలో
చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా కసరత్తు
* పురాతన నాణేలు, శిల్పాల పరిశీలన

విజయవాడ, మార్చి 6: రాజధాని అమరావతిలో కోర్ కేపిటల్ ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ సారధ్యంలోని చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులతో కూడిన నిపుణుల కమిటీ బృందాలుగా పర్యటనలు చేస్తూ వివిధ ప్రాంతాల్లోని చారిత్రక అంశాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఆర్కియాలజిస్టు కె వెంకటేశ్వరరావు, తిరుమల ఎస్వీ మూజియం ప్రధాన సంగ్రహాలయాధికారి డాక్టర్ పివి రంగ నాయకులు బృందం సోమవారం తిరుమల ఎస్వీ మ్యూజియంలోని పురాతన నాణేలను పరిశీలించింది. ఒకటో శతాబ్దం నుంచి వెలుగులోకి వచ్చిన పలు పురాతన నాణేలను, వాటి విశిష్టతను, ఆనాటి పాలనా కాలాన్ని అధ్యయనం చేసింది. ఆనాటి సంస్కృతి, సంప్రదాయాలను పరిశీలించింది. ఆ అంశాలను నేటి ఆధునిక అమరావతి నగరంతోపాటు ప్రభుత్వ భవనాల డిజైన్‌లో ప్రతిబింబింపజేసేందుకు తగిన కసరత్తులు చేస్తోంది. కేవి రావు, డాక్టర్ రంగ నాయకులు బృందం తమ పరిశీలన ద్వారా సంగ్రహించిన అంశాల నివేదికను నిపుణుల కమిటీ చైర్మన్ పరకాల ప్రభాకర్‌కు అందచేస్తుంది. రోమన్, శ్రీ కృష్ణదేవరాయలు, మొగల్, టిప్పుసుల్తాన్, తదితర రాజుల కాలం నుండి నాణేలు శ్రీనివాసుని హుండీ ద్వారా లభించగా వాటిని మ్యూజియంలో భద్రపరిచారు. వాటిలో విశిష్టమైన రామటంకా, కాళీయమర్దనం, శిరపార్వతులు, దేవనాగరి లిపిలోని నాణేలు ఈ బృందం పరిశీలించింది. నాణేలతోపాటు ఎస్వీ మ్యూజియంలోని 9, 15, 16, 17 శతాబ్దాల కాలం నాటి పురాతన శిల్పాలను కూడా పరిశీలించారు. భూ వరాహ, గరుడ, సూర్యనారాయణ, త్రివిత్రమ తదితర శిల్పాల ఆకృతులను అధ్యయనం చేసింది. దారుమంటపం, దంతాల పల్లకి, కంచిమఠం వారు వందేళ్ల కిందట ఇచ్చిన ఆఖండ దీపం, వందల ఏళ్లనాటి బ్రహ్మరథం, పురాతన శిల్పతోరణం తదితర విశిష్ట అంశాలను పరిశీలించింది.