విజయవాడ

రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్ కోసం మూడు ప్రాంతాల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: రాజధాని నిర్మాణ పనులకు అవసరమయ్యే గ్రావెల్ కోసం మూడు ప్రాంతాలను గుర్తించారు. విజయవాడ ఏపి సిఆర్‌డిఏ కార్యాలయంలో గురువారం సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ రాజధాని నగర పరిధిలో మైనింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు జేసి కృతికా శుక్లా, గుంటూరు మైనింగ్ శాఖ ఏడి శ్రీనివాస్, ఏడిసి సిఈ ఎస్.రామమూర్తి, ఏపి సిఆర్‌డిఎ ల్యాండ్స్ ఇన్‌చార్జ్ డైరక్టర్ ఎన్.రఘునాధరెడ్డి, సర్వే ఏడి శ్రీనివాస్, ఏడిసి సిఈ ఎస్.రామమూర్తి, ఏపి సిఆర్‌డిఎ తహశీల్దార్లు సుధీర్‌బాబు, పద్మనాభుడు, విజయలక్ష్మి, డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే రహమతుల్లా, ఆయా మండలాల సర్వేయర్లు, ఎన్‌సిసి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని నగర పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులకు అవసరమయ్యే గ్రావెల్ కోసం ప్రాథమికంగా మూడు ప్రాంతాలను గుర్తించారు. వీటిపై సమగ్రంగా పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. మైనింగ్ విషయంలో నిర్మాణ కంపెనీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. తవ్విన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేయాలని ఆదేశించారు. మైనింగ్‌శాఖ, సంబంధిత ఇంజనీర్లు నిబంధనల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మైనింగ్ సమస్యలపై ప్రతి శుక్రవారం గుంటూరు జేసి కృతికా శుక్లా ఆధ్వర్యంలో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. మైనింగ్ సంబంధిత సమస్యలను సమావేశంలో చర్చించి తగిన పరిష్కారం చూపాలన్నారు. రాజధాని నిర్మాణ ఏజెన్సీలకు క్యాంప్ ఆఫీసు, ఇతర అవసరాలకు కావాల్సిన స్థలాన్ని ఇంజనీర్లు నిర్ధారణ చేసి, ప్రణాళికా విభాగం పరిశీలన తర్వాత రెంటల్స్ ప్రతిపాదిస్తూ నివేదికలు ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. ఆయా ఏజెన్సీలు పనులు జరిగే ప్రాంతంతలో త్వరితంగా క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.

‘రైతుబంధు’ను సద్వినియోగం చేసుకోవాలి
* మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం
కంకిపాడు, మార్చి 9: రైతుబంధు పథకాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కొణతం సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో గురువారం రైతుబంధు పథకం కింద రుణాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్‌లోని గిడ్డంగిలో ధాన్యం నిల్వ చేసుకున్న రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన వల్లూరు సుబ్బారావు, వల్లూరు దుర్గానాగేశ్వరరావు, కె శేషగిరి, ఎం కృష్ణమోహన్, తదితర రైతులకు 2 లక్షల 10 వేల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రహరీ నిర్మాణానికి ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, మార్చి 9: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి చెందిన ఆస్తులను కాపాడుకునేందుకు దుర్గగుడి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా దుర్గగుడి అభివృద్ధి, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కొన్ని ఇళ్లను ఇప్పటికే తొలగించారు. నష్ట పరిహారం చెల్లించినప్పటికీ అధికారులు మాత్రం ఈ స్థలాలను స్వాధీనం చేసుకోలేదు. కొన్నిరోజులుగా తొలగించిన స్థలాల్లో కొంతమంది వ్యక్తులు తిరిగి పాకలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. పరిస్థితిని గమనించిన దుర్గగుడి అధికారులు గట్టు వెనుక ప్రాంతాల్లో తొలగించిన స్థలాల్లో శుక్రవారం బోర్డులు పాతి ప్రహరీ గోడ కట్టేందుకు రంగం సిద్ధం చేశారు.