విజయవాడ

అగ్రిగోల్డ్ బాధితుల దీక్షా శిబిరం తొలగింపు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: రాష్టవ్య్రాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధర్యాన రిలే నిరాహార దీక్షలు చేస్తూ తమ న్యాయమైన కోర్కెలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 6నుండి 16వరకు శాంతియుతంగా దీక్షలు జరిపేందుకు పోలీసుల అనుమతి కోరినా రిలే నిరాహార దీక్షలు 5వ రోజు ముగియగానే దీక్షా శిబిరాన్ని తొలగించడం దారుణమని, పోలీసుల వైఖరి గర్హనీయమని, ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఈ శాసనసభా సమావేశాల్లో సరైన పరిష్కారం వచ్చే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కరాఖండిగా చెప్పారు. సోమవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం చేత మోసపోయిన బాధితులు చాలా మంది కాటికి పోతుంటే, విజయవాడ నడి వీధుల్లో మోసం చేసిన యాజమాన్యం ఏసి కార్లలో తిరుగుతున్నా ప్రభుత్వానికిగాని, పోలీసు వారికిగాని కనబడటంలేదా అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అసోసియేషన్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇంతటి ఆర్థిక కుంభకోణానికి 105 మందికి పైగా చనిపోవడానికి కారణంమైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు బి విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు, కోశాధికారి జి శేషగిరిరావు, ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులకు వైద్యపరీక్షలు
విజయవాడ (క్రైం), మార్చి 13: రాష్ట్రంలోని ప్రతి పోలీసు ఆరోగ్యంగా ఉండేందుకు డిజిపి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సంవత్సరాంతపు మెడికల్ చెకప్ కార్యక్రమం నగర పోలీసు కమిషనరేట్‌లో ప్రారంభమైంది. నగరంలో పనిచేస్తున్న సిబ్బందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు బందరురోడ్డులోని ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఇన్‌ఛార్జి పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు సోమవారం ప్రారంభించారు. డీప్ ట్రస్టు సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో షుగర్, బిపి, గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్ని తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు నుంచి 40రోజుల పాటు ప్రతిరోజూ 120 మంది పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన మీదట తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. నగరంలో పని చేస్తున్న ప్రతి సిబ్బంది ఈ సంవత్సరాంతపు వైద్య పరీక్షలకు వచ్చి అన్ని పరీక్షలను చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి సీపి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపి పి హరికుమార్, డిసిపిలు జివిజి అశోక్‌కుమార్, పాలరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.