విజయవాడ

విప్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), మే 22: బ్రాహ్మణుల అణచివేత తెలుగునాట ఎక్కువగా జరుగుతోందని బ్రాహ్మణులను కించపరచిన ఏ ప్రభుత్వమూ కొనసాగదని విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్రస్వామి అన్నారు. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఘంటసాల విఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలోని కళావేదికపై సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల సాధన సదస్సుగా జరిగిన విప్రోత్సవంలో స్వామి ప్రసంగించారు. సమాజ శ్రేయస్సుకోసం, సంధ్యావందనం కోసం, గాయత్రి చేయించటం కోసం ప్రసంగించే తాను బ్రాహ్మణుల బతుకుల కోసం మాట్లాడాల్సి వచ్చిందన్నారు. బ్రాహ్మణ జాతే సంస్కృతిని రక్షించేది అని, సకల శాస్త్రాలు వేదాల సారమని ఆ వేదాలను రక్షించేది బ్రాహ్మణులేనన్నారు. బ్రాహ్మణుల అణచివేతకు కొన్ని సంస్థలు, హేతువాద సంఘాలు, కుహనా సామాజిక వాదులు పూనుకున్నాయని, అణచివేత జరగని పని అని మరో పరశురాముడు అవతరిస్తాడరు. అటువంటి వారికి బ్రాహ్మణ జాతి శాపం తగులుతుందన్నారు. సాత్వికాహారం తినే బ్రాహ్మణులనా.. సోమరిపోతులు, బద్ధకస్థులనేది అని అన్నారు. అర్చకులకు పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయమయితే గ్రామాల్లో, పల్లెల్లో ఉన్న కొన్ని దేవాలయాలు ఐదు వందలు, వేయి మాత్రమే ఇస్తున్నారని, అదీ 6నెలలకొకసారి అని అన్నారు. ఎవరిమాటనైనా ఖండించాలని ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టటానికి చట్టాలు వచ్చాయన్నారు. అన్నికులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు సుఖంగా ఉండాలని బ్రాహ్మణులు కోరుకుంటారన్నారు. ప్రభుత్వానికి బ్రాహ్మణ పీఠాధిపతులపై చులకన కూడదన్నారు. తాను ఏ వ్యక్తికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పారు. దేశంలో ఎంతోమంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులున్నారని, అలానే టంగుటూరి ప్రకాశం పంతులు, వాజ్‌పేయి, పివి నరసింహారావులాంటివారు దేశంలోని ప్రజానీకమంతా బాగుండాలని కోరుకుని పరిపాలన చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 500 కోట్లు బ్రాహ్మణ ఫెడరేషన్‌కు ప్రకటించి 100 కోట్లకే పరిమితం చేసిందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, ఎంక్వరీలు వేసినా శారదా పీఠం ఎదురొడ్డి నిలబడి సమాధానం చెబుతుందని అన్నారు.
అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య సలహాదారు కోట శంకర శర్మ సభాధ్యక్షునిగా వ్యవహరించగా వేదికపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ సంఘమే బలం సమైక్యతే నినాదం అని అన్నారు. బ్రాహ్మణ సంఘం శ్రేయస్సే లక్ష్యంగా తాము ఉద్యమిస్తున్నామరు. రాబోయే ఎన్నికలలో 13 జిల్లాలలో 13 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు రావాలన్నారు. యంత్రంగా పనిచేస్తూ ప్రతి బ్రాహ్మణుడు యోధునిలా ముందుకు సాగిపోవాలన్నారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పురోగమించాలన్నారు. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు పండిట్ భవర్‌లాల్ శర్మ మాట్లాడుతూ రాజకీయంగా బలోపేతం కావాలని, బ్రాహ్మణులే దేశానికి సుపరిపాలన అందించగలరన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జ్యోతి మాట్లాడుతూ 27 రాష్ట్రాలలో 20కోట్ల మంది బ్రాహ్మణులున్నారన్నారు. బ్రాహ్మణ సంఘం బలం ఐక్యతతోనే సాధ్యం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కోసూరు సతీష్ శర్మ వేదికపై 15 తీర్మానాల ప్రతిని విడుదల చేసి చదివి వినిపించారు. వేదికపై అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య కోశాధికారి చంద్రశేఖర శర్మ, కర్నాటక ప్రభుత్వ మంత్రి దినేష్ గుండూరావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, జివిఆర్ ఎన్‌ఎస్‌ఎస్‌ఎస్ వర ప్రసాద్, శర్వాణి మూర్తి, డాక్టర్ చెట్లపల్లి మారుతీ ప్రసన్న, అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య మహిళా అధ్యక్షురాలు మాలిని, నగర మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, యల్లాప్రగడ విజయలక్ష్మి, ప్రయాగ కృష్ణ, గుడిపాటి శ్రీరామచంద్రదత్తు, తాడికొండ పల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వేదికపై పండిట్ భవర్‌లాల్, దేవేంద్ర శర్మలకు భారత బ్రాహ్మణ రత్న వేణుగోపాలాచారికి భాతర బ్రాహ్మణ విభూషణ్, డాక్టర్ చెట్లపల్లి మారుతీ ప్రసన్న, డాక్టర్ జివిఎన్‌ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్‌లకు భారత బ్రాహ్మణ సేవారత్న మైలవరపు బాలసుబ్రహ్మణ్య శర్మకు భారత బ్రాహ్మణ భూషణ బిరుదులను ప్రదానం చేశారు.