విజయవాడ

సీపీ సవాంగ్‌కు అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 17: లండన్ వెళ్లిన నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ నగరానికి చేరుకున్నా రు. నూతన పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, కమాండ్ కంట్రోల్ పనితీరు తదితర అంశాలపై ఆయన అధ్యయనం చేశారు. ఈనెల 6న సీపి లండన్ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ఆయన పలు అంశాలపై అధ్యయనం చేశారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి పో లీసు ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసి న ఎగ్జిబిషన్‌ను వీరంతా సందర్శించి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం పోలీసుశాఖలో వాటి ఉపయోగాల గూర్చి చర్చించారు. ఈనెల 16న నగరానికి చేరుకున్న సవాంగ్ తిరిగి విధులకు హాజరయ్యారు. ఆయన లం డన్ వెళ్లిన వారం రోజులు సిఐడి అదనపు డిజి ద్వారకా తిరుమలరావు ఇన్‌ఛార్జి సీపిగా వ్యవహరించారు. విధులకు హాజరైన సీపిని శుక్రవారం కమిషనరేట్‌లోని పోలీసు అధికారులు మ ర్యాద పూర్వకంగా కలిశారు. మరోవైపు విజయవాడ పోలీసు అధికారుల సం ఘం ప్రతినిధులు సీపిని కలిసి అభినందనలు తెలియచేశారు. సీపిని కలిసిన వారిలో జాయింట్ సీపి పి హరికుమా ర్, డిసిపిలు పాలరాజు, జివిజి అశోక్‌కుమార్, కాంతిరానా టాటా, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సోమయ్య, గోపి తదితరులు ఉన్నారు.

విభజన హమీలపై అసెంబ్లీలో చర్చించాలి

విజయవాడ, మార్చి 17: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు గురించి అసెంబ్లీలో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు శుక్రవారం లేఖ రాశారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు గణాంకాలతో సహా వివరించిన నేపథ్యంలో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, స్థూల ఉత్పత్తి, సాగునీటి లభ్యత, మాతా శిశు మరణాలు వంటి అనేక రంగాల్లో మానవాభివృద్ధి సూచికల్లో ఈ వెనుకబాటు వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర వినజన చట్టంలో సెక్షన్ 46లో ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, షెడ్యూల్ 13లో ఐఐఎం, పెట్రో యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీలు ఏర్పా టు చేస్తామని, ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైల్వేజోన్, మెట్రో రైల్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారన్నారు. అలాగే రాయలసీమకు కడప ఉక్కు, అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం మరికొన్ని విద్యాసంస్థలు హామీ ఇచ్చారన్నారు. రాయలసీమ తీవ్ర కరువుకు గురౌతున్నా సహాయక చర్యలు లేవన్నారు. అయితే గత రెండు సంవత్సరాల్లో జిల్లాకు కేవలం రూ.50 కోట్లు చొప్పున 7 జిల్లాలకు రెండు సంవత్సరాల్లో రూ.700 కోట్లు ఇచ్చారని, మూడో సంవత్సరం ఆ మాత్రం కూడా కేటాయించలేదన్నారు. కేటాయించిన సొమ్ము కూడా అభివృద్ధికి కాకుండా ప్రభుత్వ రోజువారీగా వినియోగించే బిల్డింగ్ రిపేర్లు, కంప్యూటర్లు/ప్రింటర్లు కొనుగోలు వంటి వాటికి ఖర్చు చేశారన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఊసేలేదు. అలాగే రాయలసీమ హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టు ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తామని వాగ్దానం చేసారన్నారు. మూడేళ్లు అయినా నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. ఉత్తరాంధ్రలో ఐఐఎం, పెట్రో యూనివర్సిటీలకు నిధులు నామమాత్రంగానే కేటాయించారన్నారు. గిరిజన యూనివర్సిటీకి ఇంకా స్థలాన్ని కూడా కేటాయించలేదన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు ప్రధానంగా విద్యారంగంలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేయడం సహించరానిదన్నారు. ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖలోని వైద్య కేంద్రం విమ్స్‌కు ఒక్కపైసా కూడా కేటాయించలేదన్నారు. విశాఖ మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన నివేదికలు వచ్చినా ఇంకా ప్రాజెక్టు శంకుస్థాపన కూడా జరగలేదు. ఈ విధంగా విభజన చట్టంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ఇచ్చిన హామీ లు అమలుకాకుండా సాచివేత ధోరణి అవలంబించడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదన్నారు. విషయాలన్నింటిపై చర్చ జరిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుతున్నామని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.