విశాఖ

పాడేరు ఘాట్‌లో విరిగిపడిన కొండ చరియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 23: పాడేరు ఘాట్‌లో శుక్రవారం కొండ చరియలు విరిగి పడడంతో దాదాపు ఏడు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఘాట్‌లోని రాజ్‌పురం వద్ద కొండ చరియలు విరిగి ప్రధాన రహదారిపై పడ్డాయి. శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రధాన రహదారిపై కొండ చరియలు పడడంతో మైదాన ప్రాంతం నుంచి పాడేరు వైపు, పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే అన్ని రకాల వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుకు అడ్డం గా పడిపోయిన కొండ చరియల వలన వాహనాలు వెళ్లేందుకు ఏ మాత్రం దారి లేకపోవడంతో ఘాట్‌లో వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరి ఉండిపోవలసి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యరు. ఘాట్‌లో వాహనాలు నిలిచిపోవడంతో మహిళలు, చిన్నారులు అనేక అవస్థలను ఎదుర్కొన్నారు. అయితే అధికారులు యుద్ధ ప్రాతిపదికపై ప్రొక్లెయినర్‌తో కొండ చరియ లు తొలగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో సాయంత్రం ఆరు గంటల ప్రాంతానికి రోడ్డుపై కొండ చరియలను తొలగించడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి. కొండ చరియలు విరిగిపడిన సమయంలో ఎటువంటి వాహనాలు ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్థానిక శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ పునరుద్ధరణ పనులను సమీక్షించారు.