విశాఖ

తహశీల్దార్‌పై ఉద్యోగుల తిరుగుబాటు బావుటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, అక్టోబర్ 4: జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమకు సూపర్ బాస్‌గా వ్యవహరించే జ్యుడీషియల్ అధికారి తహశీల్దార్‌పై ఆయన వద్ద పనిచేస్తున్న విఆర్‌వోలు, ఇతర ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేసారు. అకారణంగా తమను ప్రతి వివాదంలోను ఇరికిస్తున్నారని ఆయన దగ్గర తాము పనిచేయలేమని వారంతా స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కార్యాలయ ప్రతినిధిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేసారు. దీంతో గత చాలాకాలంగా తహశీల్దార్‌కు, సంబంధిత దిగువ స్థాయి ఉద్యోగులకు మధ్య నెలకొన్న సమన్వయ లేమి, విభేదాలు ఒకేసారి భగ్గుమన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తమ పేరుమీద ఉన్న భూమిని మరొకరి పేరుమీద మార్చడాన్ని నిరశిస్తూ మండలంలో సిహెచ్‌ఎన్ అగ్రహారం గ్రామానికి చెందిన పలువురు రైతులు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. తహశీల్దార్ కృష్ణమూర్తి వివరణ సంతృప్తినివ్వకపోవడంతో పురుగుల డబ్బా చేత పట్టుకుని సంబంధిత అధికారి వైఖరిని నిరశిస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొండుపాలెంకు చెందిన అద్దేపల్లి రామునాయుడు అనే వ్యక్తికి చెందిన భూమి రికార్డులు వేరొకరి పేరుమీద ఆన్‌లైన్ అయిన విషయంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఇదే తరహాలో ఆందోళన జరిగింది. ఆర్‌ఐ, విఆర్‌వోల నివేదిక వలనే తాను ఆ విధంగా నమోదు చేసానని తహశీల్దార్ కృష్ణమూర్తి వివరణ ఇవ్వడంతో సంబంధిత ఉద్యోగులు అవాక్కయ్యారు. తాము అక్కడి వాస్తవ పరిస్థితులను మాత్రమే తహశీల్దార్‌కు నివేదించామని, ఆన్‌లైన్ చేయమని ఎక్కడా నివేదించలేదని సంబంధిత ఆర్‌ఐ, విఆర్‌వోలు లబోదిబోమంటున్నారు. ఈ విషయంలో తమను అన్యాయంగా ఇరికించి తహశీల్దార్ కృష్ణమూర్తి తప్పించుకోవాలని చూస్తున్నారని వారు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ గత్యంతరం లేని పరిస్థితుల్లో తహశీల్దార్‌పై తిరుగుబాటు బావుటాకు సిద్ధమయ్యారు. ఇదే పరిస్థితి నేడో రేపో తమకూ కూడా ఏర్పడుతుందనే భయంతో మండలంలోని విఆర్‌వోలు, ఇతర ఉద్యోగులు కూడా తహశీల్దార్ వద్ద తాము పనిచేయలేమంటూ మాస్ క్యాజువల్ లీవ్ పెడుతున్నట్లు తహశీల్దార్ కార్యాలయంలో ప్రకటించి అక్కడి నుండి ప్రదర్శనగా స్థానిక ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇటువంటి అధికారుల వద్ద పనిచేయలేమంటూ ఖరాఖండిగా చెప్పారు. ఆర్‌ఐలు గాయత్రీ, సుదాకర్, విఆర్‌వోలు గణేష్, కాశిబాబు, బి. అప్పారావు, బిఆర్ నాయుడు, కమల తదితరులు ఆర్డీవో కార్యాలయ ప్రతినిధికి వినతిపత్రం అందజేసారు. తాము పంపే నివేదికలపై అధికారులెవరూ పెన్నులు పెట్టబోమని ఒట్టేసిన నేపధ్యంలో ఈ నేపధ్యంలో ఈ తగవు తేలేవరకు తహశీల్దార్ కార్యాలయంలో లావాదేవీలన్నీ పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.