విశాఖ

సరిహద్దుల్లో ఉద్రిక్తత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, అక్టోబర్ 7:పెదపాడు అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు కొనసాగుతుంది. దీంతో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెదపాటు - చీపురుగొంది అటవీ ప్రాంతంలోమావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగగా, ముగ్గురు మావోయిస్టులకు గాయాలైన విషయం తెలిసిందే. వీరు పట్టుబడగా మరి కొందరు గాయాలతో తప్పించుకుని పోయినట్లు పోలీసు వర్గాల వద్ద సమాచారం ఉంది. ఈనేపథ్యంలో వారి కోసం విస్తృతంగా గ్రేహౌండ్స్ బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టు కదలికలు పెరిగాయన్న సమాచారంతో జిల్లా ఎస్పీ గూడెంకొత్తవీధి మండలంలోని పలు పోలీస్ స్టేషన్లను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు జరగడం, పోలీస్ బలగాలు విస్తృత గాలింపు, తనిఖీలు చేయడంతో గిరిజన గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఏ సమయంలో ఏ ముప్పు వాటిల్లుతుందోనని భయాందోళనలో గిరిజన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతం బూట్ల చప్పుళ్ళతో మారుమోగుతుండడంతో వ్యవసాయ పనులకు గిరిజనులు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది.