విశాఖ

పనిచేయని సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, నవంబర్ 15: గ్రామాభివృద్ధికి కృషిచేయని సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం స్థానిక టీడిపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వం 14వ ఆర్థిక సం ఘం నిధులు నేరుగా పంచాయతీలకు అందజేస్తున్నప్పటికీ కొంతమంది సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చూపుతూ నిధులు ఖర్చు చేయడం లేదని, అటువంటి సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దుచేస్తామన్నారు. ఇప్పటికే కొంతమందికి రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఎన్నికల హామీలన్నింటిని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నిరంతరం కృషిచేస్తున్నారన్నారు. జనసేన నాయకుడు, సినీహీరో పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రావడాన్ని తాను స్వాగతిస్తానన్నారు. అయితే ఆయన ప్రసంగాలు మాత్రం జనాలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయన్నారు. గత ఎన్నికల సమయంలో పవన్‌కల్యాణ్ సహకారం కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో టీడిపిలకు లాభించిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో ఎంతగానో చనువు ఉన్నందున ప్రధానమంత్రిని కలసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అభివృద్ధిపరమైన చర్యలు తెలియజేస్తే ప్రయోజనముంటుందన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత రహదారులు 1800 కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించగా ఒక్క మన ఆంధ్రరాష్ట్రంలోనే 4500కిలోమీటర్లు సిసి రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో వేసామన్నారు. చోడవరంలో పంచాయతీకి గత రెండేళ్లలో 80లక్షల రూపాయలను అందజేసామన్నారు. రాబోయే మూడేళ్లలో ఇదే ప్రాతిపదికన నిధులు సమకూరుస్తామన్నారు. 2019 నాటికి అన్ని గ్రామాల్లోను అంతర రహదారులను సిమ్మెంట్ రోడ్డులుగా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి కూడా నిధులు సమకూరుస్తున్నామన్నారు. పదిలక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పధకం ద్వారా ఐదులక్షలు, సంబంధిత శాఖ ద్వారా రెండులక్షలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు మూడులక్షలు అందజేస్తున్నామన్నారు. గాజువాక, విశాఖపట్నం, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో కొండలను ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారందరికీ ఆయా స్థలాలను ముఖ్యమంత్రి ఉచితంగా అందజేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పప్పల చలపతిరావు, గోవాడ షుగర్స్ చైర్మన్ మల్లునాయుడు తదితరులు పాల్గొన్నారు.