విశాఖ

పెద్దనోట్ల రద్దుపై సిపిఎం ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, నవంబర్ 22: పెద్దనోట్లతోనే నల్లధనం ఉంటే 2000 రూపాయల నోట్లను ఎందుకు అమలులోకి తెచ్చారంటూ సిపిఎం పార్టీ చోడవరం డివిజిన్ పరిధిలోని సబ్బవరం మండలంలోని అన్ని బ్యాంకుల వద్ద మంగళవారం పార్టీనేతలు ఆందోళన చేపట్టారు. అందులోభాగంగా స్థానిక వాణిజ్యబ్యాంకుల ముందుకు వెళ్ళి అక్కడ వినియోగదారులతో మాట్లాడారు. ఈసందర్భంగా చోడవరం డివిజిన్ కన్వీనర్ గండి నాయినిబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేడన్నారు. గత ఎన్నికల ప్రచారంలో 90శాతం నల్లధనం విదేశాలకు తరలిపోయిందంటూ అధికారంలోకి వచ్చిన మోడీ అక్కడి నల్లధనం తెచ్చి కుటుంబానికి 15 లక్షలు పంపిణీ చేస్తానని ప్రకటించారని గుర్తుచేశారు. రెండున్నరేళ్ళయినా ఆ ధనం తేలేదన్నారు. అంతేకాకుండా డిసెంబర్ 30 వరకు నల్లధనం తెల్లధనంగా మార్చుకోవచ్చని ఆయనే వెసులుబాటు కల్పించారన్నారు. పెద్దనోట్లతోనే అవినీతి పెరిగిపోయే అవకాశం ఉన్నందున 500,1000 రూపాయల నోట్లను తక్షణం అన్ని బ్యాంకులకు విడుదల చేసి సామాన్య,మధ్యతరగతి ప్రజల కష్టాలు తీర్చాలన్నారు. లేదంటే పంట చేతికి వచ్చిన రైతులు సైతం కూలీలకు చెల్లించే డబ్బులేక ఎన్నో ఇబ్బందులు పడతున్నారని, చివరికి రైతులకు పంటలు పండినా కష్టాలు తప్పని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, ఎం.గౌరీశు తదితరులు పాల్గొన్నారు.