విశాఖ

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, నవంబర్ 22: విశాఖ మన్యంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడు రోజుల నుండి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. చలితో కూడిన గాలులు , పొగ మంచు దట్టంగా ఉండడంతో ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్ళేందుకు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్ళేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే కాని పొగ మంచు వీడడం లేదు. పాఠశాలకు వెళ్ళే విద్యార్థులయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు పట్టపగలు కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు చేస్తున్నారు. మంగళవారం లంబసింగిలో ఐదు డిగ్రీలు, చింతపల్లిలో 8 డిగ్రీలు, గూడెంకొత్తవీధిలో 5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.