విశాఖ

గ్రామాల్లో వౌలిక వసతుల మెరుగుకు పుష్కలంగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, నవంబర్ 22: గ్రామాల్లో వౌలిక వసతుల మెరుగుకు పుష్కలంగా నిధులు సమకూర్చనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. జనచైతన్య యాత్రలో భాగంగా మండలంలోని సుందరయ్యపేట, వెంకుపాలెం, సీతానగరం, రొంగలివానిపాలెం, మొండిపాలెం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే మంగళవారం విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి తాగునీటిని సేవిస్తే కిడ్నీవ్యాధులు ప్రబలుతున్నాయని, తమను వేరే ప్రాంతానికి తరలించాలని మొండిపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఏకరవుపెట్టారు. అచ్చియ్యపేట నుండి తాగునీటిని సరఫరా చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ మీరందరూ ఏకాభిప్రాయానికి వస్తే అచ్చియ్యపేట గ్రామానికి మీ ప్రాంతాన్ని తరలించి అక్కడ కొత్తగా కాలనీలు నిర్మించి ఇస్తామని భరోసా పలికారు. గత రెండేళ్ల క్రితం తుమ్మపాల ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు ఇప్పటికీ బకాయిలు అందలేదని సీతానగరం రైతులు ఏకరవుపెట్టగా త్వరలోనే చెల్లింపులు జరిగేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సుందరయ్యపేట, వెంకుపాలెం మార్గంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా డబుల్‌రోడ్డు నిర్మించాలని కోరగా ఇందుకు అవసరమైన ప్రతిపాధనలు సిద్దం చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను కోరారు. వెంకుపాలెంలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి జనచైతన్య యాత్రల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీపి కొణతాల వెంకట సావిత్రి, జెడ్పీటిసి పల్లెల గంగాభవానీ, మండల దేశం మాజీ అధ్యక్షులు కొణతాల శ్రీను, సుందరయ్యపేట సర్పంచ్ రేఖా అమ్మాజీ, సీతానగరం సర్పంచ్ గంగుపాం రామలక్ష్మి, ఎంపీటిసిలు రాపేటి రాము, అండిబోయిన అప్పలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.