విశాఖ

దేశంలో ఎక్కడా లేనివిధంగా రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, డిసెంబర్ 4: దేశంలో ఎక్క డా లేని విధంగా రైతులకు సుమారు 25 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఒక్క చంద్రబాబునాయుడేనని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కశింకోటలో జరిగిన జనచైతన్యయాత్ర లో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. డ్వాక్రా మహిళలకు రెండు విడతలుగా మూడువేలు చొప్పున అందజేసారన్నారు. భారతదేశంలో తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబు ఇద్దరూ కలిసి పార్టీకి కష్టపడే కార్యకర్తలకు, వారి పిల్లలకు విద్య, వైద్యంలో సహాయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నా రు. 50లక్షల మంది సభ్యత్వాలు ఒక ఏడాదిలో తీసుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ మాట్లాడుతూ కశింకోట పలు సమస్యలను మంత్రి గం టా దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు డిసిసిబి డైరక్టర్ సిదిరెడ్డి శ్రీనివాసరావు, మురళీధర్, పెంటకోట రాము, బుదిరెడ్డి చిన్నా, వేగి గోపికృష్ణ, వేగి వెం కట్రావు, పెంటకోట సత్యనారాయణ, తాకాశి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
* మంత్రి అయ్యన్న
చోడవరం, డిసెంబర్ 4: గ్రామాల్లో పూర్తిస్థాయి వౌలిక సదుపాయాల కల్పనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని నర్సయ్యపేట, అంకుపాలెం, శ్రీరామపట్నం గ్రామాల్లో జనచైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో రక్షిత మంచినీటిని అందించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో మంచినీటి పథకాల నిర్మాణం, మరమ్మతులు కూడా చేపడుతూనే ఉన్నారన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా నర్సయ్యపేట గ్రామస్థుల కోరిక మేరకు రక్షి త మంచినీటి పథకం నిర్మాణానికి 40లక్షల రూపాయలు నిధులు సమకూర్చడంతోపాటు గతంలో నిర్మించిన రక్షిత మంచినీటి పధకం మరమ్మతులు గురికావడంతో దానిని కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి కనిశెట్టి మత్స్యరాజు, ఎంపీపి గూనూరు కొండతల్లి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డేడ నాగగంగాదర్, బికె శ్రీను, శ్రీను తదితర పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.