విశాఖ

‘కొటాన’ సమర్థుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, డిసెంబర్ 4: ఆర్‌ఇసిఎస్ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొటాన అప్పారావు సమర్ధుడైన నాయకుడని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆర్‌ఇసిఎస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన కొటాన ప్రమణాస్వీకారోత్సవంలో స్థానిక ఎమ్మె ల్యే పీలా గోవిందసత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి గంటా మాట్లాడుతూ సహకార రం గంలో రాష్టవ్య్రాప్తంగా చూసుకుంటే అనకాపల్లి ఆర్‌ఇసిఎస్‌కు మంచి క్రేజ్ ఉందన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చైర్మన్ పదవి మీకు గుర్తుంపు తేవడం కాదని మీరే ఆ పదవి కి వనె్న తేవాలని అప్పారావును ఉద్దేశించి తెలిపారు. ఈ సంస్థలో చైర్మన్లుగా చేసి మృతి చెందిన వారు వినియోగదారుల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారని అదేవిధంగా మీరు కూడా పరిపాలన చేయాలని కోరారు. గతం కంటే బిన్నంగా కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలన్నారు. రైతులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరాచేయాలన్నారు. నేటి నుండి ఐదువేల రూపాయలు అందజేస్తున్న ఎన్టీఆర్ కరుణసేవ పథకం నుండి 20వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యేలు పీలా గోవిందసత్యనారాయణ, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎం.పి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావులు మాట్లాడుతూ ఆర్‌ఇసిఎస్‌లో ఉన్న ఉద్యోగులకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందజేయాల్సిన బాధ్యత చైర్మన్ అప్పారావుమీద ఉందన్నారు. గతంలో చైర్మన్లుగా పనిచేసిన పివి రమణ, ఎస్‌ఆర్‌ఎస్ అప్పలనాయుడు నిస్వార్ధంగా పనిచేసారన్నారు. నూతన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన కొటాన అప్పారావు మాట్లాడుతూ దేశం పార్టీకి చెందిన వారు ఎవరువచ్చినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల సలహాలు సూచనలు తీసుకుంటూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తానని స్పష్టం చేశారు. తనహాయాంలో ఉద్యోగులకు న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిచైర్మన్ లాలం భవానీ భాస్కర్, జడిపిసిటి మలసాల ధనమ్మ, ఎంపిపి పెంటకోట సుబ్బలక్ష్మీ, ఐదు మండలాల్లో ఉన్న సర్పంచ్‌లు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.