విశాఖ

నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ఉద్యమ స్థాయిలో ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాం కర్లు, ఆంధ్రా విశ్వవిద్యాలయం అధ్యాపకులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోట్ల రద్దు అనంతరం చిన్ననోట్ల కొరత వల్ల సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే ఇది తాత్కాలికమేనన్నారు. నోట్ల రద్దు అనంతరం జిల్లాలో ఇప్పటి వరకూ 1,019 పిఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లు సమకూర్చినట్టు తెలిపారు. దీనివల్ల కొంతమేర నగదు ప్రభావం తగ్గిందన్నారు. వచ్చే 15 రోజుల్లో జిల్లాలో 6000 పిఓఎస్ మెషీన్లు ఏర్పాటు చేసే విధంగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే విధంగా గ్రామీణుల్లో అవగాహన కల్పించేందుకు కళాశాల విద్యార్థులు, యాజమాన్యాలు ముందుకు రావాలని సూచించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 292 కళాశాలలు ఉన్నాయని, జిల్లాలోని జివిఎంసి సహా 39 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని కళాశాలలు దత్తత తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాలు, వార్డుల్లో నగదు రహిత లావాదేవీలు, పిఓఎస్ యంత్రాల నినియోగం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే రూపే కార్డు, వాలెట్‌ల వినియోగం, అందుకు ముందస్తుగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో పింఛన్ల పంపిణీ చేపట్టిన దృష్ట్యా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకర్లు చిన్న నోట్లను గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శరత్‌బాబు, నగదు రహిత లావాదేవీల సమన్వయ అధికారి రామ్మోహన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.