విశాఖ

పింఛను తీసుకునే దారేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: నిరుపేద వృద్ధులకు, భర్తలను పోగొట్టుకున్న వితంతువులకు, పని చేసుకోలేని దివ్యాంగులకు ప్రభుత్వం తరపున సామాజిక పింఛన్లు అందజేస్తోంది. వృద్ధాప్య, వితంతు పింఛన్లుగా రూ.1000, దివ్యా ంగులకు రూ.1,500 చొప్పున ప్రతి నెలా వారి చేతికందే మొత్తం ఇప్పుడు బ్యాంకుల్లో భద్రంగా ఉంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆర్థికావసరాలను తీర్చాల్సిన సొమ్ము బ్యాంకు ల్లో భద్రంగా ఉండటమేటని అనుమానిస్తున్నారా! నిజమే కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో సామాజిక పింఛన్ల పంపిణీ అంశంలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. నోట్ల రద్దు నిర్ణయం గత నెల 8న వెలువడటంతో అప్పటికే 99 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయిపోయింది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల సొమ్ము పంపిణీ దగ్గరకి వచ్చే సరికే చిక్కుముడి పడింది. 20 రోజుల్లో పరిస్థితి సద్దుమణుగుతుంది కదాని భావించిన ప్రభుత్వం ఇప్పటికీ నోట్ల విడుదల ఆలస్యం కావడంతో చేసేది లేక ప్రభుత్వం పింఛను మొత్తాలను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. జిల్లాలో 3.24 లక్షల మందికి సామాజిక పింఛన్లను ప్రభుత్వం ప్రతి నెలా పంపిణీ చేస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటి వరకూ 2.81 లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల పింఛన్ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన 43 వేల మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో నగదు రూపంలో అందించాలని నిర్ణయించారు. అయితే బ్యాంకుల్లో జమ చేసిన పింఛన్ సొమ్మును లబ్ధిదారులు తీసుకునేందుకు వెళ్తే నిరాశ ఎదురవుతోంది. జిల్లాలో పట్టణ ప్రాంతం, మండల కేంద్రాలు, కాస్త పెద్ద గ్రామాల్లో మాత్రమే బ్యాంకులున్నాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దాదాపు 10 నుంచి 15 గ్రామాలకు ఒక బ్యాంకు మాత్రమే ఉంది. ఇక ఎటిఎంల పరిస్థితి చెప్పనవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటిఎం దాఖలాల్లేవు. జిల్లాలో 2.81 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్ సొమ్మును తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్తే అక్కడ నగదు లేదన్న సమాధానం ఎదురవుతోంది. ఒక్కో లబ్ధిదారుకు రూ.1000, దివ్యాంగులకు రూ.1,500 చెల్లించాలంటే కుదరని పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏ విధంగా పంపిణీ చేయలో అర్ధం కాక బ్యాంకు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరికి కలిపి రెండు వేల నోటు ఇస్తే ఏ ఇబ్బందులు ఎదురవుతాయోనని ఆలోచన. ఇక బ్యాంకు ఖాతాల్లేని వారికి సంబంధించిన పింఛన్ మొత్తాలను మండల అభివృద్ధి అధికారుల ఖాతాల్లోకి, వారి నుంచి గ్రామ కార్యదర్శుల ఖాతాల్లోకి వేసి, నగదు రూపంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక్కడ కూడా బ్యాంకుల్లో నగదు లభ్యం కాక కార్యదర్శులు కూడా చేతులెత్తేస్తున్నారు. సమస్య తెలియని వృద్ధులు, దివ్యాంగులు, బ్యాంకులకు పదేపదే ప్రదక్షణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఇదేమీ తమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందోనని ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం ఎదురు చూసే పండుటాకులు, దివ్యాంగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.