విశాఖ

పశువులకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, డిసెంబర్ 15: శాస్తస్రాంకేతిర రంగాల అభివృద్ధితో నూతన విధానం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటి వరకు కేవలం మనుషుల శరీరంలోపలి భాగాలు పనిచేసే తీరును గుర్తించటం, స్ర్తిల గర్భాశయంలో శిశువుల స్థితిగతులు, ఆడ, మగ శిశువుల నిర్థారణకు ఉపయోగిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ పద్ధతిని ఇకపై పశువుల గర్భకోశ వ్యాధులను గుర్తించటం, ఆయాపశువుల గర్భంలో పెరుగుతున్నది ఆడ లేక మగ దూడా? అనే విషయాలను గుర్తించే దిశగా పశుసంవర్థక శాఖ అడుగులు వేస్తోంది. అయితే జిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్కానింగ్ పరికరం సుమారు 10 లక్షల రూపాయల ఖరీదు ఉంటుందని నర్సీపట్నంకు చెందిన పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఉమాశంకర్ మహాపాత్రో విలేఖరులకి తెలిపారు.
ఈ నూతన విధానంలో పశువుల గర్భంలోకి డ్యూసర్ అనే పరికరాన్ని ప్రవేశపెడతారు. దానికి అమర్చిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరం డాక్టర్లు కళ్ళకు తగిలించుకుని గర్భంలోపలి భాగాలను పరీక్షిస్తారు. దీంతో పశువుల గర్భాశయంలో హై-ఫ్రీక్వెన్సీతో స్కానర్ పంపితే సంకేతాల ద్వారా తెలుపు, ఎరుపురంగుల్లో వైద్యులు తెలుసుకుంటారన్నారు. గర్భకోశయంలోఇన్‌ఫెక్షన్ ఉన్నా, కాయలు, నీటి బుడగలను గుర్తించవచ్చన్నారు. అలాగే పశువుగర్భం దాల్చినట్లయితే 56 రోజులు తర్వాత పిండం పనితీరునుబట్టి ఆడ,మగ నిర్థారణ చేయవచ్చన్నారు. అండం సైజు 16 ఎంఎం సైజులోఉండగా పుట్టేదూడల గురించి తెలుసుకునే వీలుంటుందన్నారు. ప్రయోగాత్మకంగా ఈ పరికరం ఫలితాలు విజయవంతమయినందున గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించాలని జిల్లాలో నిపుణులైన వైద్యులకు శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారన్నారు. ఇటీవల అమృతపురం గోపాల మిత్ర సేవాసంఘంలో అధునాతన పరీక్షలు నిర్వహించిన ఆయన గుల్లేపల్లి, సబ్బవరం పశువైద్యులకు ఈ స్కానింగ్, డ్యూసర్ పరికరాలు ఉపయోగించే విధానాలను వివరించారు.

స్వచ్ఛందంగా లొంగిపోతే కేసులుండవు
* మావోయిస్టులకు డిఎస్పీ అనిల్ పిలువు
సీలేరు, డిసెంబర్ 15:మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారిపై ఎటువంటి కేసులు ఉండవని ప్రభుత్వం ప్రకటించిన వార్డులు కూడా వారికే అందజేస్తామని చింతపల్లి డిఎస్పీ అనిల్‌పులిపాటి వెల్లడించారు. చింతపల్లి డి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు అడవుల్లో ఉండి సాధించేదేమీ లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోతే వారికి మనుగడ ఉంటుందన్నారు. ప్రభుత్వం కూడా స్వచ్ఛందంగా లొంగిపోయిన వారిపై కేసులు లేకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. వారి జీవనోపాధికి ఉపాధి సౌకర్యాల ఏర్పా డు చేస్తుందన్నారు. అవుట్ పోస్టుల ఏర్పాటు వలన మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కొంత మంది అమాయ గిరిజనులను అడ్డం పెట్టుకుని తప్పుడు విధానాలతో ఆందోళన చేపడుతున్నారని డిఎస్పీ అన్నారు. రాళ్ళగెడ్డ అవుట్ పోస్టు ఏర్పాటు వలన గిరిజనుల కమ్యూనికేషన్, మినరల్ వాటర్ ఫ్లాంట్, వైద్య సౌకర్యం కల్పించామన్నారు. గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగ పోలీస్ వ్యవస్థ పని చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాల్లో చదువున్న యువతకు వారి విద్యార్హతను బట్టి ఉపాధి కల్పనకు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీస్ శాఖలో ఇటీవల ఎంపికైన యువతకు తదుపరి అర్హత పరీక్ష కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నామన్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విధాలాచర్యలు చేపడుతున్నామన్నారు. దారకొండలో అవుట్ పోస్టుల వలన గిరిజనులకు నష్టం లేదని, అవుట్ పోస్టుల వలన అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జి.కె.వీధి సి. ఐ. గోవిందరావు, స్థానిక ఎస్సై విభూషణరావులు పాల్గొన్నారు.