విశాఖ

అభివృద్ధి దిశగా అనకాపల్లి నియోజకవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 18: తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనకాపల్లి నియోజకవర్గం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని అందుకు సహకరించిన సిఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో జరిగిన అనకాపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో ఆర్టికల్చర్‌కు 125 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసారన్నారు. అలాగే అర్హులైన వారందరికీ పెన్షన్ మంజూరు చేయడం, బైపాస్ రోడ్డు నుండి నూకాంబిక ఆలయం మీదుగా పూడిమడక రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి ఐదుకోట్ల నిధులు మంజూ రు చేశారన్నారు. ఎప్పటి నుండో అభివృద్ధికి నోచుకోని పరమేశ్వరీ పార్కు ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేసి సర్వాంగ సుందరంగా పార్కును అభివృద్ధి చేయడానికి 1.43కోట్లు మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ మధ్య నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజల నుండి అనూహ్య స్పం దన వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అనకాపల్లి నియోజకవర్గానికి అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు ప్రభు త్వం నుండి మంజూరు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు నుండే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. ఈ ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారని ఈ సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్లి ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషిచేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపి కొణతాల వెంకట సావిత్రి, పట్టణాధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు, నిమ్మదల త్రినాధరావు, జెడ్పీటిసి మలసాల ధనమ్మ, వేగి గోపీకృష్ణ, డాక్టర్ విష్ణుమూర్తి, కొణతాల శ్రీనివాసరావు, పెంటకోట రాము, నడిపల్లి గణేష్ పాల్గొన్నారు.