విశాఖ

మన్యంలో పెరిగిన చలి తీవ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, డిసెంబర్ 19: విశాఖ మన్యంలో చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. సోమవారం లంబసింగిలో నాలుగు డిగ్రీలు, చింతపల్లిలో 7 డిగ్రీలు, గూడెంకొత్తవీధిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజన్సీ ప్రాంతాన్ని పొగ మంచు కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరా యం ఏర్పడుతుంది. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడడమే కాకుండా ప్రస్తుతం మన్యంలో ముమ్మరంగా సాగుతున్న కాఫీ పండ్ల సేకరణకు కూడా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
సీలేరులో
సీలేరు: సీలేరులో గత రెండు రోజుల నుంచి వాతావరణఃలో మార్పులు చోటు చేసుకోవడంతో చలి తీవ్రత అమాంతంగా పెరిగిపోయింది. దీంతో ఉష్ణోగ్రతల్లో పలు మార్పులు రావడంతో ఆది, సోమవారాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి తీవ్రత అధికంగా ఉండడంతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చల్లటి గాలలతో కూడిన వాతావరణంలో ప్రజలు వణుకుతున్నారు. చలిమంటలు వేసుకుని చలి నుండి ఉపశమనం పొందుతున్నారు. రాజస్థాన్ నుండి వర్తకులు ఉన్ని దుస్తుల విక్రయాలు జరుపుతుండడంతో వీటిని స్థానికులు అధికంగా కొనుగోలు చేశారు.