విశాఖ

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.డి.పేట, డిసెంబర్ 19: గ్రామీణ ప్రాం తాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో దేశం ప్రభుత్వం పని చేస్తుందని, కొత్తగా ఐదు లక్షల ఇళ్ళు, మూడున్నర పింఛన్లు కొత్త సంవత్సరంలో మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గొలుగొండ మండలం ఎ.ఎల్.పురంలో 3.70 కోట్లతో నిర్మాణాలు పూర్తి చేసిన 14 సి.సి. రోడ్లు, బస్ షెల్టర్, అంగన్‌వాడీ భవనాలను సోమవారం మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్ కాంప్లెక్స్ ఆవరణలో జెడ్పిటిసి చిటికెల తారకవేణుగోపాల్ అధ్యక్షతన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ వచ్చే ఏడాది మరో ఐదు లక్షల ఇళ్ళు, మూడున్నర లక్షల పింఛన్లు ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 4,500 కిలోల మీటర్ల సి.సి.రోడ్ల నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు. రానున్న రెండున్నరేళ్ళ కాలంలో రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో సి.సి.రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎం.పి. అవంతి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 24 వేల కోట్లు రైతు రుణాలు, 10 వేల కోట్లు డ్వాక్రా రుణాలు రుణ మాఫీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రజలను ఆదరించే పాలనతో పాటు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న అయ్యన్నపాత్రుడు వంటి వారిని ఎల్లప్పుడూ విశ్వసించాలని ఆయన కోరారు. నేత పార్టీ యువనేత విజయ్ మాట్లాడుతూ రాష్ట్రం 16 వేల కోట్ల రూపాయల అప్పుతో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారన్నారు. మంత్రి అయ్యన్న దత్తత తీసుకున్న ఎ.ఎల్.పురంలో ఏడాదిన్నరలో 3.70 కోట్లతో చేసిన అభివృద్ధి ఇంత వరకు ఐదు దశాబ్దాలుగా ఏ ఒక్కరూ చేపట్టలేదన్నారు. ఈ పంచాయతీలో మిగిలి ఉన్న 40 శాతం అభివృద్ధి పనులను త్వరలోనే నిధులు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు విజయ్ తెలిపారు. జెడ్పిటిసి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ పంచాయతీలో తక్కువ కాలంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడుకి గ్రామం తరుపున రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎడి ఎ.రామకృష్ణ, రీజనల్ మేనేజర్ సుధీర్‌బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హిమబిందు, బి. ఎం. వెంకటరెడ్డి, జెఇ సత్యనారాయణతో పాటు ఎఎల్.పురం సర్పంచ్ లగుడు పద్మ, ఎం.పి.పి. లక్ష్మీనారాయణ, ఆర్డీవో సూర్యారావు, అడిగర్ల అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఐటిడిఎ
టర్నోవర్ రూ.వెయ్యి కోట్లు చెయ్యాలి
లక్ష్య సాధనకు టిడిపి కృషి
మంత్రి రావేల కిషోర్ బాబు
మాడుగుల(రూరల్), డిసెంబర్ 19: ప్రస్తుతం 180 కోట్లు ఉన్న పాడేరు ఐటిడిఎ ఉత్పత్తులు, ఆదాయాల టర్నోవర్‌ను వెయ్యికోట్లు చెయ్యాలన్న లక్ష్యంతో తమ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గిరిజన, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి రావేల కిషోర్ బాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని తాటిపర్తి గిరిజన పంచాయతీలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న పాఠశాలలోని అన్ని తరగతులకు వెళ్లి పాఠ్యాంశాలను బోధించే విధానాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నోట్‌బుక్‌లను తీసుకొని వారిచేత అందులోని పాఠ్యాంశాలను చదివించారు. భవిష్యత్‌లో మీరు ఏమి ఉద్యో గం చెయాలను కుంటున్నారని విద్యార్థులను ప్రశ్నించారు. వసతి గృహంలో విద్యతోపాటు భోజనం, వసతి సౌకర్యంగా ఉందాలేదాని అని ప్రశ్నించారు. పదో తరగతిలో కేవలం 54 మంది విద్యార్థినీలే ఉన్నారని వీరి సంఖ్యను పెంచాలన్నారు. విద్యార్థినులు ఉత్తీర్ణత కావడం ముఖ్యం కాదని వారు 90 శాతం ర్యాంక్ సాధించేలా విద్యాబోధన సాగాలని తెలిపారు. వసతి గృహంలో మరుగుదొడ్లు తలుపులు సక్రమంగా లేవని వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని, వసతి గృహంలో శిథిలమై ఉన్న భవనాన్ని కూడా వెంటనే తొలగించాలని హెచ్‌ఎమ్ రోజ్‌మేరీకి, ఏఈ దేశయ్యకు ఆదేశించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అరకు కాఫీ పౌడర్‌ను అంతర్జాతీయం చేయడానికి అరకులో అంతర్జాతీయ సమ్మెళనం ఏర్పా టు చేస్తామన్నారు. గిరిపుత్రిక కల్యాణ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రంగురాళ్లు అక్రమ తవ్వకాలు నిరోధించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. మైదాన ప్రాంతంలో ఉన్న 526 గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్ చేర్చడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఓండ్రు గంగమ్మ కృష్ణ, వైస్ ఎంపిపి పెరుమళ్లు వెంకటరావు, దంగేటి సూర్యారావు, తహశీల్దార్ శైలజ, మాడుగుల, చీడికాడ ఎస్సైలు పాల్గొన్నారు.