విశాఖ

నన్నయ్యసెట్-2016 విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 7: ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు వెల్లడించారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్షలు మే 10 నుంచి ఉంటాయన్నారు. ఈ ఏడాది నుంచి 12 కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఫీజు రాయితీ ఇస్తున్నదని, మిగిలిన 70 వేలకు రుణం పొందే వీలు ఉందని చెప్పారు. ఎంబిఎలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ వంటి కోర్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయమైనా, 460 అనుబంధ కళాశాలలను కలిగి ఉందని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీట్లు లభించని వారు తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని వారు స్థానికులుగా పరిగణిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ధనుంజయరావు, డైరెక్టర్ (అడ్మిషన్స్) మట్టా రెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ వర్మ, డీన్ టేకి పాల్గొన్నారు.