విశాఖ

నియోజకవర్గంలో రూ.కోట్లు... రాష్ట్రంలో ఇంకెంతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, డిసెంబర్ 22: నియోజకవర్గంలోని మండల స్థాయిలో జరిగిన ఉపాధి పనుల్లో కోట్లా ది రూపాయల అవినీతి జరిగితే రాష్ట్రంలో ఇంకెంత అవినీతి జరిగిందోనని వెంటనే దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప డిమాండ్ చేశారు. ఉపాధి నిధుల అవకతవకలపై మాకవరపాలెం మండల కేంద్రం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన యర్రాపాత్రుడికి ఆమె గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఉపాధి పథకం నిధులు ఖర్చుకు కేంద్రం ఇచ్చిన నిబంధనలను పక్కన పెట్టిరాష్ట్ర ప్రభుత్వం ఈనిధులతో పనులు చేపట్టి అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. ఉపాధి శాఖా మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు నిర్వహిస్తున్న ఉపాధి శాఖలో కోట్లాది రూపాయల అవినీతి జరిగితే ఇప్పటి వరకు ఎటువంటి విచారణ చేయలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీకి తాండవ రిజర్వాయర్ నుంచి తాగునీటి కోసం 150 కోట్లు మంజూరు చేస్తే అయ్యన్నపాత్రుడు మంత్రి అయిన తరువాత ఆనిధులను టెండర్లు వేయకుండా రద్దు చేసారన్నారు. తమ ప్రభుత్వం ప్రజల కోసమే ఉందని చెబుతున్న మంత్రి ఇటువంటి అవకతవకలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని ఆమె పేర్కొన్నారు.
సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
పెదబయలు, డిసెంబర్ 22: స్థానిక కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో కనీస వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వనబారికి మహేశ్వరరావు అన్నారు. గురువారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రతినిధులు పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నారు. విద్యార్థినులకు వౌలిక వసతులు కల్పంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పాఠశాలలో చాలీచాలని మరుగుదొడ్లు, ప్రహరీ గోడ లేకపోవడంతో బాలికలకు రక్షణ కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా ఇప్పటివరకూ నోటు పుస్తకాలు పంపిణీ చేయలేదని ఆయన ఆరోపించారు. మన్యంలో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ బాలికలకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేయలేదన్నారు. బాలికలు ఆడుకునేందుకు కనీసం క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాలికలకు వౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రతినిధులు ఎన్.శ్రీనుబాబు, కె.బంగారయ్య, సి.హెచ్.్ధయానిధి, పి.నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.