విశాఖ

స్మార్ట్‌సిటీకి చలిభయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 25: విశాఖ నగరంలో చలి మరింతగా పెరిగింది. రోజురోజుకీ ఇది పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువుగా కురవడం వలనే ఈ పరిస్థితి నెలకొందని భావిస్తున్నారు. పగలు సైతం వాతావరణం పూర్తిగా చల్లబడడం, చలిగాలులు వీయడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతన్నారు. మిట్టమధ్యాహ్నం ఎండ సమయంలోనూ వాతావరణం చల్లగా ఉంటోంది. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోగా, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో చలి భయం పట్టుకుంది. పగలు సైతం చలి మంటలు వేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరి వరకు ఈ పరిస్థితి తప్పదని అంటున్నారు. ఉదయం పది గంటలైనా మంచు తెర విప్పుకోవడంలేదు. దట్టమైన పొగమంచులో వాహనాలు నడుస్తున్నాయి. నగరంలోను, నగర శివారుప్రాంతాల్లో కొండల వద్ద పొగమంచుతో వాహనాల రాకపోలకు కాస్తంత ఇబ్బందులుంటున్నాయి. రగ్గులు, దుప్పట్లు కప్పుకున్నా అవి ఏమాత్రం వేడిమినివ్వకపోగా, చల్లని నీటిలో ముంచి తీసునట్టుగా మారిపోతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు వాతావరణంలో మార్పులు తీసుకువస్తుండగా, వృద్ధులు, చిన్న పిల్లకలు జ్వరపీడితులుగా మారుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడుతున్నందున వీరితో క్లినిక్‌లు నిండిపోతున్నాయి.