విశాఖ

బెల్లంపై ఆంక్షలు విధిస్తే ఉద్యమబాటలో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిరూరల్, డిసెంబర్ 27: స్థానిక బెల్లం మార్కెట్‌లో బెల్లం ఎగుమతులు, దిగుమతులు యధావిధిగా మంగళవారం కొనసాగాయి. బెల్లంలో హైడ్రాక్సైడ్ ఎక్కువ మోతాదుల్లో కలుపుతున్నారని దీంతో వ్యాదులు సంక్రమించే ప్రమాదం ఉందనే నేపద్యంలో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు అకస్మాత్తుగా సోమవారం అనకాపల్లి బెల్లం మార్కెట్‌లోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో వర్తకసంఘం ప్రతినిధులు, రైతులు కలిసి అధికారులు ఈ విధంగా చేయడం పద్దతి కాదని ప్రతిఘటించడం తెలిసిందే. దీంతో సోమవారం మధ్యాహ్నం ట్రేడింగ్‌ను నిలిపివేసి వర్తకసంఘం ప్రతినిధులు సమావేశమై బెల్లం లావాదేవీలను యధావిధిగా కొనసాగిద్దామని నిర్ణయించి తిరిగి మంగళవారం ఉదయం ప్రారంభించారు. బెల్లంలో ఎటువంటి తేడాలు ఉన్నా ఆయా షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడంతో ఇదే పరిస్థితి వస్తే రైతులు, వ్యాపారస్తులు కఠినమైన నిర్ణయం తీసుకునే వీలుంది. ఈ సందర్భంగా వర్తకసంఘం ప్రతినిధులు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) మాట్లాడుతూ సుగర్‌ఫ్యాక్టరీ తెరవరు, తయారుచేసిన బెల్లంపై ఆంక్షలు విధించడం ఏమిటని ఆయన ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో నల్లబెల్లంపై ఆంక్షలు విధించారని, ఇప్పుడు ఎర్రబెల్లంపై ఆంక్షలు విధిస్తున్నారని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు ఏం పండించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సుగర్‌ఫ్యాక్టరీనైనా తెరిపించాలి, వ్యవసాయాధికారులను గ్రామాల్లోకి వెళ్లి రైతులకు బెల్లం తయారీపై అవగాహనైనా కల్పించాలన్నారు. బెల్లంలో ఈ పదార్ధం కలపకూడదని రైతులకు అవగాహన కల్పిస్తే లాభ ముంటుందిగాని తయారుచేసిన బెల్లంపై దాడులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదిఏమైనా ఆఖరికి రైతులు తను తయారుచేసుకున్న పంటను కూడా అమ్మకానికి తీసుకురాకూడదనే ఉద్దేశంతోనే అధికారులు దాడులు చేస్తున్నారన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన అధికారులు ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్న సమస్యలపై కూడా స్పందిస్తే బాగుండునని వర్తకసంఘం ప్రతినిధి పెదబాబు ఆంధ్రభూమికి తెలిపారు.

గిరిజనుడిని చంపిన మావోలు?
సీలేరు, డిసెంబర్ 27 : పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి ఒక గిరిజనుడిని హతమార్చారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి . మల్కన్‌గిరి జిల్లా కుడుముల గుమ్మా బ్లాక్ పరిధిలోని చిత్రకొండ కటాఫ్ ఏరియాసాయుధలైన మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి గిరిజనుల పునరావాస కేంద్రానికి వచ్చి రవి పూజారి(40), నంద గొల్లూరు(37)లను అదుపులోకి తీసుకుని వారిని సమీప అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ వారి పద్దతి మారలేదని, తమ మాటను లెక్క చేయడం లేదని రవి పూజారిని కాల్చి చంపారు. దీంతో గ్రామస్తులు విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకోగా మావోయిస్టులు పోలీసులు వస్తున్నారేమోనని మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయాందోళన చెందిన గిరిజనులు పారిపోయారు. మావోల అదుపులో ఉన్న నందగొల్లూరు కూడా చాకచక్యంగా మావోల నుండి తప్పించుకుని పారిపోయాడు. మావోలు కాల్చి చంపిన రవి పూజారి మృత దేహాన్ని గోవిందపల్లి, జైపూర్ రహదారి మధ్యలో మావోలు పడవేసారు. మంగళవారం ఉదయం మావోల చెర నుండి తప్పించుకున్న నంద గొల్లూరి గ్రామానికి వచ్చి విషయాన్ని తెలిపాడు. గ్రామస్తులు ఈవిషయమై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసుల మృత దేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని బంధువులకు అప్పగించారు. రామగూడ ఎన్‌కౌంటర్‌నేపధ్యంలో తమ గ్రామస్తులకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులైన మల్కన్‌గిరి జిల్లా ఎస్పీని కోరినప్పటికీ తమకు ఎటువంటి రక్షణ చేపట్టలేదని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రవి పూజారిని హతమార్చిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్.కె, ఉదయ్ తదితర నాయకులు ఉన్నట్లు గిరిజనులు చెప్పడంతో ఎ. ఓ.బి.లో పోలీస్ ఉన్నతాధికారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎ. ఓ.బి. పోలీసులు అప్రమత్తం అయ్యారు.