విశాఖ

దేవాదాయ భూములు సాగుచేసుకోడానికే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, జనవరి 5: దేవాదాయ భూములు సాగుచేసుకోవడమే తప్ప వాటిని రైతుల పేరిట బదిలీ చేయడం వంటివి జరగవని శాసన మండలి సభ్యుడు, టి.డి.పి. రూరల్ జిల్లా అధ్యక్షుడు పప్పల చలపతిరావు స్పష్టం చేశారు. నాల్గో విడత జన్మభూమి కార్యక్రమంలో గురువారం మండలంలో ఒమ్మలి, గాదిరాయి, వి.జె.పురం, కింత లి గ్రామాల్లో నిర్వహించారు. తహశీల్దార్ శేష శైలజ, ఎంపీడీఓ ఎస్.డేవిడ్‌రాజులు రెండు బృందాలుగా ఏర్పడి ఈ నాలుగు పంచాయితీల్లో ఈ కార్యక్రమా లు చేపట్టారు. ముందుగా ఒమ్మలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామానాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో డి.సి.సి.బి. డైరెక్టర్ బొద్దపు దేముళ్ళనాయుడు మాట్లాడుతూ ఒమ్మలి శివారు ప్రాంతంలో ఉన్న 260 ఎకరాల దేవాదాయ భూమిని గత కొనే్నళ్ళుగా ఇక్కడి రైతులు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. వారి పేరిట ఆ భూములు బదిలీ చేయాలని రైతులు వినతిపత్రం ద్వారా కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేవాదాయ భూములను రైతులు సాగుచేసుకుని జీవనం సాగించడం తప్ప వాటిని బదిలీ చేయడం జరగదన్నారు. సాగుచేస్తున్నవారందరికీ కేవలం సాగుహక్కు మాత్రమే ఉంటుందన్నారు. దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళి సాగుచేస్తున్న వారికి సాగుహక్కు కల్పించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. అలాగే గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి విశేష సేవలందించారన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయానికి పలుమార్లు తిరగకుండా ప్రభుత్వానే్న ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ యాత్రల వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలపై అవగాహన పంచుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి గోవిందరాజు, మండల ప్రత్యే క అధికారిణి శైలజ, గ్రామ సర్పంచ్‌లు అద్దేపల్లి, జగ్గారావు నందారపు సన్యాసిరావు, అధికారులు పాల్గొన్నారు.