విశాఖ

సంక్రాంతి పండగ పూట విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొలుగొండ, జనవరి 13: సంక్రాంతి పర్వదినం రోజున కొయ్యూరు, చింతపల్లి మండలాల్లోని డౌనూరు, రొబ్బసింగి, సమగిరి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకుని వస్త్రాలు, కిరాణా సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆటోలో పలువురు శుక్రవారం నర్సీపట్నంకు వస్తున్నారు. ఏటిగైరంపేట వద్దకు వచ్చేసరికి ఎదురెదురుగా వస్తున్న ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెల్లాచెరుదుగా పడి ఉన్న మృతదేహాలను చూసి కన్నీళ్ళపర్యంతమయ్యారు. మృతదేహాలను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. పండుగ వేళ గ్రామాల్లో సందడి నెలకొనాల్సి ఉండగా ఆ మూడు గ్రామాల్లో శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోగా ఆటో డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతులందరూ గిరిజనులు. పండుగ సరుకుల కోసం బయలుదేరిన తమ కుటుంబాల వారు విగతజీవులుగా మారడాన్ని గ్రామస్తులు, బంధువులు తట్టుకోలేక పోతున్నారు. మరో పావు గంట వ్యవధిలో నర్సీపట్నం చేరుకుని పండుగ సరుకులు కొనుగోలు చేసుకుని తిరిగి ఇళ్ళకు వెళ్ళాల్సిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారని రోదిస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారందరూ కుటుంబ యజమానులే కావడంతో వారిపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. తీవ్రగాయాలకు గురైన వారిని 108 సిబ్బంది విశాఖ కె.జి.హెచ్.కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్య రస్తోగి సంఘటనా స్థలాన్ని సందర్శించి, పరిశీలించారు.
హెచ్‌పిసిఎల్‌లో తప్పిన భారీ ప్రమాదం
సింథియా, జనవరి 13 : హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ విశాఖ యూనిట్‌లో భారీ ప్రమాదం శుక్రవారం తప్పింది. రాత్రి 9 గంటల సమయంలో సిడి-1 విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో హెచ్‌పిసిఎల్ అధికారులు అత్యవసర అలారం నాలుగు సార్లు మోగించి పరిసర ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. ఏం జరుగుతుందో తెలియని ప్రజలు గందరగోళానికి, అయోమయానికి గురవుతున్న సమయంలో లాంగ్ అలారం మోగించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రసాయనిక చర్య జరుగుతున్న సమయంలో మంటలు వ్యాపించాయని, వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలు అదుపు చేశారని, దీంతో భారీ ప్రమాదం తప్పిందని కార్మికవర్గాలు చెబుతున్నాయి. దీనిపై హెచ్‌పిసిఎల్ విశాఖ యూనిట్ హెచ్‌ఆర్ మేనేజర్‌ను ఆంధ్రభూమి వివరణ కోరగా స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుందని, వెంటనే మంటలను అదుపు చేయడం జరిగిందని, పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని తెలిపారు.