విశాఖ

ఎద్దుల పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జనవరి 16: ఆధునీకత అన్నిరంగాల్లో మాదిరిగానే పంటలసాగులో సైతం అనూహ్యంగా ప్రభావం చూపుతుంది. భూమిని దుక్కుచేసి వేసే పంటకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర వహించే ఎద్దులతో ఉపయోగించే నాగళ్లకు ప్రత్యాహ్నమయంగా ట్రాక్టర్లు, ట్రిల్లర్లు తదితర ఆధునాతన యంత్ర పరికరాలు వచ్చాయి. దీంతో సన్నచిన్నకారు రైతులు సైతం కోడిగిత్తల ద్వారా దుక్కుదునే్న విదానానికి స్వస్తిపలికి ఆధునీక వ్యవసాయ యంత్రాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. అయితే తిరిగి కోడిగిత్తల పెంపకంపట్ల కొందరు రైతులు ఆసక్తి కనపరుస్తున్నారు. జాతర్లు, ఉత్సవాల్లో జరిగే ఎద్దుల పోటీలకు వీటిని సిద్ధం చేస్తున్నారు. గడచిన దశాబ్దకాలంగా క్రమేపి ఎద్దుల పోటీలకు సందర్శకుల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. గతంలో కోడి, పొట్టేలు, గుర్రపు పందాలు తదితర పోటీలు ఉండేవి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణప్రాంతీయులతోపాటు నగర వాసులు సైతం ఎద్దుల పోటీలను తిలకించేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. దీంతో చోడవరం, చీడికాడ, బుచ్చెయ్యపేట తదితర మండలాల్లోని పలువురు రైతులు జాతర్లో జరిగే ఎద్దుల పోటీలకు తాము పెంచే గిత్తలను సిద్ధం చేసి పోటీల్లో విజయం సాధించేందుకు అనువుగా శిక్షణ ఇస్తున్నారు. ఆ విధంగా ఈ ప్రాంతంలోని నరసయ్యపేట, చుక్కపల్లి, కొత్తపెంట, సింహద్రిపురం తదితర ప్రాంతాలకు చెందిన జట్లు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి తదితర సుదీర ప్రాంతాల్లో జరిగే రాష్టస్థ్రాయి ఎద్దుల పోటీల్లో సైతం తీసుకువెళ్లి పలు ప్రతిష్ఠాత్మకత బహుమతులను కైవసం చేసుకుంటున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు మైసూర్‌జాతి ఎద్దులు, నాటుజాతి, సాధారణ జాతి ఎద్దులను సిద్ధం చేస్తున్నారు. పోటీల్లో విజయం సాధించేందుకు అనువుగా ఉలవలు, తదితర పిండి పదార్థాలను, పోషక విలువలు కలిగే ఆహారాన్ని ఇవ్వడంతోపాటు పరుగులో వాటికి తర్ఫీదు ఇస్తున్నారు.అయితే పోటీల్లో పాల్గొనే ఎద్దులకు నిర్వాహకులు రెండు నుండి మూడు వేలు కనీస చార్జిలు చెల్లిస్తున్నారు. పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన జట్టుకు 8నుండి 10వేల మొత్తాన్ని, ద్వితీయ బహుమతి సాధించిన జట్టుకు ఆరు నుండి ఎనిమిదివేలను, తృతిదయ బహుమతిగా ఐదు నుండి ఆరువేల రూపాయలను చెల్లిస్తున్నారు. అయితే పోటీల్లో గెలుపొందడం ద్వారా తమ వ్యక్తిగత గౌరవం పెరుగుతుందని, కుటుంబ గౌరవానికి, గ్రామ గౌరవానికి చిహ్నంగా ఈ పోటీల్లో విజయాన్ని పెంపకందార్లు భావించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత సంక్రాంతి సంబరాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఎద్దుల పందాలు జోరుగా సాగుతున్నాయి. ఎద్దుల పందాలు తిలకించేందుకు వచ్చేవారికి నయాపైసా ఖర్చులేకుండా ఉండటం, ఇతర సుదీర ప్రాంతాల నుండి స్నేహితులు, బంధువులు ఒకేచోట కలుసుకునేందుకు ఈ పందాలు నిర్వహణ వేదిక కావడం కూడా మరో ప్రధాన కారణమవుతుంది. జిల్లా వ్యాప్తంగా పందాల్లో పాల్గొనేందుకు దాదాపుగా 50 జట్లు ఉన్నాయి.ప్రతి ఏటా పందంలో పాల్గొనే ఎద్దుల జట్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే విశాఖ జిల్లా పేరుచెపితే మంచి ప్రతిభ కనపరిచే జట్లు ఉన్నాయనే నానుడి కూడా ఉంది.